'హలో నాన్నగారూ''

ఆయన తలతిప్పి త్రివిక్రం వంక చూసాడు. కాని బదులు పలకలేదు.

''భోజనం అయిందా?'' ప్రశ్నించాడు.

''ఇంకా లేదు''.

''ఎందుకాలస్యం చేసింది ? ఫోన్‌లో మీకు పెట్టేసానని అమ్మ చెప్పింది? అమ్మని అడుగుతా ఉండండి''.

రాకింగ్‌ చెయిర్‌ని ఊపి బయటికి వచ్చాడు త్రివిక్రం.

''అమ్మ! నాన్నగారికి భోజనం పెట్టలేదా ?'' అడిగాడు.

''ఇంతసేపు ఆగుతానా? పదకొండున్నరకల్లా పెట్టేసాను. పెట్టలేదన్నారా ?'' నవ్వుతూ అడిగింది జనని.

''అవును''

''సరే. నువ్వు కూర్చో, ఇవాళ నీకు ఆపరేషన్‌ ఉంటుందని భయపడ్డాను.

''లేదు''

''ఇవాళ ఓ విశేషం ఉంది తెలుసా ?'' అడిగింది.

''ఏమిటి?''

''ఇవాళ....''

ఆ విశేషం ఏమిటో తెలుసుకోవాలంటే మనం శ్రీమల్లాది వెంకటకృష్ణమూర్తి గారి రచన అనగనగా ఓ నాన్న నవల చదవాల్సిందే.

తర్వాత ఓ రోజు తన తల్లి గురించి ఓ ఆశ్చర్యకరమైన నిజం త్రివిక్రమ్‌కి తెలిసింది.

తన తండ్రిని దాని గురించి అడిగినా చెప్పే పరిస్థితిలో లేడు.

తన నించి గోప్యంగా ఉన్న తన అసలు తండ్రిని కనుగొనాలనే సంకల్పం త్రివిక్రమ్‌కి కలిగింది.

ఏమిటా ఆశ్చర్యకరమైన నిజం!

అంతకాలం రహస్యంగా ఉన్న ఆ నిజం అతనికి ఎలా తెలిసింది ? చిత్ర విచిత్రమైన మలుపులతో సాగే ఈ కుటుంబ నేపధ్య సస్పెన్స్‌ థ్రిల్లర్‌ పాఠకులని చదివింపచేస్తుంది. చక్కని ఇతివృత్తం. సులభశైలితో ఉత్కంఠ కలిగించే నవల ఇది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good