ప్రముఖ రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు మొదటి అమెరికా యాత్రని 1990 సెప్టెంబరు 22న పూర్తి చేసుకుని, మళ్ళీ దాదాపు పదిహేడేళ్ళ తర్వాత రెండోసారి అమెరికా వెళ్ళారు.
మొదటిసారి అమెరికాలోని ముఖ్యమైన యాత్రాస్ధలాలను చూడటానికి టూరిస్టుగా వెళ్ళారు. తిరిగి వచ్చాక ఆ యాత్రానుభవాలన్నింటినీ పుస్తకరూపంలో 'ట్రావెలలాగ్‌ అమెరికా' అనే పేరుతో ప్రకటించారు.
రెండోసారి టూరిస్ట్‌గా కాక అక్కడ చదువుకుని, ఉద్యోగం చేస్తున్న వారి అమ్మాయితో కొన్ని నెలలు గడపటానికి వెళ్ళారు. ఆయన అమెరికాలో ఉన్న మూడు నెలల మూడు రోజులూ అమెరికన్స్‌ జీవన విధానాన్ని చాలా దగ్గరనించి గమనించారు. ఈ ట్రావెలాగ్‌ని ఈ కొత్త కోనంలోంచి రాస్తున్నారు. ఆయన మొదటి రాసిన ట్రావెలాగ్‌లో ఈ సమాచారం లేదు. విద్యార్ధులుగా కాని, ఉద్యోగరీత్యాకాని, లేదా అక్కడి బంధుమిత్రులతో గడిపి రావడానికి అనేక మంది తెలుగు వాళ్ళు అమెరికాకి వెళ్ళి వస్తున్నారు. అలాంఇ వారికి అక్కడ జీవన విధానం పరిచయమైతే, అక్కడ ఏది ఆశించవచ్చో ఏది దొరకదో, కొంత వరకైనా తెలియజేయాలనే ఉద్ధేశ్యంతో ఈ రచన చేశారు కృష్ణమూర్తిగారు. అక్కడికి వెళ్ళే అవకాశం గల వారినే కాక సామాన్య పాఠకులను కూడా 'అమెరికాలో మరోసారి' అవరిస్తుంది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good