మొగల్‌ సామ్రాజ్య స్థాపకుడు బాబర్‌ అయినా దాన్ని భారతదేశంలో స్థిరీకరించినవాడు అక్బర్‌. తండ్రి మరణంతో తన 8వ ఏట మొగల్‌ సామ్రాజ్యానికి వారసుడై కొన్నాళ్ళు తండ్రి అనుయాయుడు, బైరామ్‌ఖాన్‌ ప్రభుత్వ బాధ్యతలు నిర్వహించగా నిదానంగా అతడిని దూరంచేసి ఏకవ్యక్తి పాలకుడయ్యాడు.

ఈ చదువురాని పండితుడు అన్ని మతాల సారాన్ని ఆ మత ప్రచారకులతో చర్చించి అన్ని మతాలలో కొంత మంచి, కొంగ చెడూ వుందని: అన్ని మతాలలో హేతువుకి నిలచేదే మంచిదిగా భావించాడు. మత సమన్వయం లేనిదే సామ్రాజ్య స్థిరీకరణ అసాధ్యమని హిందు రాజులను తన కొలువులో నియమించుకోవడమేకాక హిందూ యువతులను వివాహమాడాడు.

అన్ని మతాల వారితో చర్చల్లో మునిగి తను జన్మించిన ఇస్లామ్‌లోనూ లోపాలున్నాయని తన స్వంత మతం ''దీన్‌-ఇలా-హీ'' ప్రతిపాదించినా దాన్ని తన కొలువుకే పరిమితం చేశాడు. అతడు ముస్లిమ్‌లకు హిందువుగా, హిందువులకు ముస్లిమ్‌గా కన్పించాడు. అప్పుడే భారతదేశం చేరిన క్రీస్తు ప్రచారకులను కూడా ఆకర్షించాడు కాని వారు అతడిని మెప్పించలేకపోయారు. అతడి కొలువులో ముస్లిమ్‌ లేక హిందువులు ముఖ్యపాత్ర వహించారు. అంతేకాదు అక్బర్‌ ఎన్నో సాంఘిక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజల సుఖశాంతులకు తోడ్పడిన మేథావి.

Pages : 136

Write a review

Note: HTML is not translated!
Bad           Good