జీవితం అంటే ఇంతే- ఆనందాన్ని దుఖం, దుఖాన్ని ఆనందం ఒకదాన్ని ఒకటి కబళించాలని అహర్నిశలూ ప్రయత్నిస్తుం టాయి . - జీవితం పట్ల శ్రీధర్ అవగాహన ఇది. తండ్రి దాన ధర్మాలకి ఆస్తంతా కరిగిపోయింది. ఇంటికి పెద్ద దిక్కు కన్నుమూయగానే ఆ కుటుంబం పూర్తిగా చితికిపోయింది. తల్లితో కలసి తలదాచుకుందుకి అత్తయ్య ఇంటికి చేరాడు. అత్తయ్య కూడా ఆదరించింది .
అయితే విధి అక్కడా చిన్న చూపే చూసింది. అమ్మ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది. అత్తయ్యనే అమ్మయింది. అత్తయ్య కూతురు ఉమా అనురాగం పంచి యిచ్చింది. కానీ మళ్ళి పరిస్థితులు  అతడిని కలవర పెట్టాయి.
ఉమకి క్షయ అని తేలింది. చిన్నతనం నుంచీ తోడూ నీడగా నిలచిన ఉమని ఎలాగైనా సరే దక్కించుకోవాలి - ఇదే శ్రీధర్ ఆలోచన. మరోవైపున కుంగదీసే నిరుద్యోగం.
సౌదర్యం, లావణ్యం, మాటలో తియ్యదనం. మనసంతా మంచిదనం ఉన్న పద్మిని, జీవశ్చవంగా నైన బతికే అవకాశం కోల్పోయిన రేణూల పరిచయాలు అతడి జీవితం మీద బలమైన ముద్ర వేశాయి. మనసు కోరుకుంటున్నది వేరు. బాధ్యతలు బందీ చేసి నిర్దేశిస్తున్న కర్తవ్యం వేరు
అతడే సర్వస్వమని అనుకునే  ఉమని వదులుకోవాలా? తను లేందే జీవితమే లేదనే పద్మినిని వదులుకోవాలా ? ఏం చేశాడతడు ? ఎవరి కోసం ఎవరు ఆహుతి అయ్యారు? జీవితంలో ప్రతికూలతల అనివార్యతలనీ ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితులు విపరీత ప్రభావాన్నీ ఆర్ధ్రంగా చిత్రించిన యద్దనపూడి సులోచనారాణి నవల - ఆహుతి. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good