నవల ఇంగ్లండులో 1813లో వెలువడింది. అంతకుముందు పాఠకలోకానికి బొత్తిగా తెలియని జేన్ ఆస్టన్ అనే ఓ యువ రచయిత్రి ఈ పుస్తకంతో సాహిత్య లోకంలోకి దూసుకొచ్చింది. రెండుదశాబ్దాల నాటి ఈ నవల ఇప్పటికీ పాఠకుల మన్నలను పొందుతూనే ఉంది. పాత్రలన్నీ ఆనాటి గ్రామీణ భూస్వాముల కుటుంబాలకు చెందినవే.
మానం - మర్యాద, సంస్కారం, కుసంస్కారం, నీతి - అవినీతి, విద్య, వివాహం, పెంపకంలో పాటించాల్సిన విలువలు తదితరాలు ఈ నవల్లో చర్చకి వస్తాయి. ఇప్పటికి రెండు కోట్ల ఇంగ్లిషు ప్రతులు అమ్ముడుపోయిన నవల ఇది.
ఇందులో ఎలిజబెత్ బెన్నెట్ అనే పాత్ర చుట్టూ ఈ నవల తిరుగుతుంది. ఐదుగురు ఆడ పిల్లలున్న కుటుంబంలో ఈమె రెండోది. తండ్రి బెన్నెట్ సంస్కారి, విద్యావంతుడు. కాని వ్యవహర్త కాదు. బాగా డబ్బులున్న వాళ్ళకి కూతుళ్ళను కట్టబెట్టాలనే యావ తప్ప, తల్లికి మరే సంస్కారమూ లేదు. ఎలిజబెత్ మాత్రం అచ్చంగా తండ్రి కూతురు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good