అతడు నిరంతర అన్వేషి, అన్వేషణ ఫలించడం కాదు ధ్యేయం,
కనపడనిదాన్ని అన్వేషిస్తూ బ్రతకడమే ఈ నితంతర
యాత్రికుని తాపత్రయం'

అంటూ మానవ జీవితపు సంఘర్షణలోంచి, ఉద్రేకంలోంచి, ఉద్వేగంలోంచి ఎగసిపడే కోపాలపట్ల, క్రోథాలపట్ల మనలో సానుభూతిని కలిగించగలుగుతాయి. ఈ సానుభూతి మనం మర్చిపోతున్న మన బతుకుజాడలను గుర్తుచేస్తుంది.

జీవితంపట్ల, ఇష్టం, జీవితాన్ని అందంగా చూడడం, జీవితంలో ప్రతిక్షణాన్ని పదిలపరుచుకోవడం, అలా చేసుకోవడానికి కావలసిన స్వేచ్ఛను, స్వచ్ఛతను సాధించడం జగన్నాథరావుగారి కథల గొప్పదనం. చాలా మామూలుగా, చిన్న చిన్న కబుర్లను వింటున్నట్లుగా, ఒక ఫంక్షన్లో కలిసిన దూరపు చుట్టపు స్వగతాన్ని పంచుకుంటున్నట్లుగా, ఎప్పుడో తెగిన స్నేహం అనుకోకుండా అతుక్కొని జ్ఞాపకాల పందిరి అల్లుతున్నట్లుగా ఈ కథలు మనికి తెలీకుండానే మనలో జీవితం పట్ల సెన్సిటివ్‌నెస్‌ని ఇంజక్టు చేస్తాయి. ఒక్కసారి కదలడం అలవాటయ్యిందంటే.. ప్రతి సూర్యోదయపు ఆకుల తడిని అందుకోవడానికి సిద్దమయినట్లే.

అలా తడిసిన హృదయంల్లోంచి...
- నండూరి రాజగోపాల్

Write a review

Note: HTML is not translated!
Bad           Good