తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపచేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు.

అధికారులు ఆశ్రితజనులు

బ్రతక నేర్చిన వాడికి యీ లోకం పచ్చల పల్లకి. నోట్లో నాలుకలేని వాడికి యిదే లోకం గచ్చపొదలా కనిపిస్తుంది. నాగరాజుకు మేడలు, మిద్దెలు లేవు కాని, మేడలు, మిద్దెలు గల మోతుబరులతో పరిచయం వుంది.

నాగరాజుకి ఏ అధికారమూ లేదు, కాని అధికారులందరినీ అతను తన యింటికి ఆహ్వానిస్తాడు. కలెక్టర్లు మొదలుకుని, సాధారణ అధికారులవరకూ అతని చమత్కారాలకీ, చాకచక్యాలకీ లొంగని వారుండరు.

అధికారుల్ని అయిన విధానా, కాని విధానా, ఆశ్రయించి - తన యింట్లో చిల్లిగవ్వ లేకపోయినా, వారి హోదాలనే, అంగళ్ళలో ధనంగా పణం పెట్టి, తను కుహనా పరువు ప్రతిష్ఠలను మెట్టుమెట్టుగా పెంచుకో గలిగిన నాగరాజు వంటి పరాన్నభుక్కులు, నిత్యం ఏదో రూపంలో మీ చుట్టూ తిరుగుతూనే వుంటారు.

నాగరాజుల స్వభావాలలాగే, రోజులన్నీ ఇటువంటి వారి పాలిట ఒక్కలాగ వుండవు. జీవిత నాగుపాము కుచ్చిత అనుభవాల విషం కక్కినపుడు ఎంతమూలగా నక్కి వందామనుకున్నా, వారి బ్రతుకులు వికృతరూపాలలో బయటపడక తప్పదు.

అప్పుడు - వారి వ్యక్తిత్వాలలో, బ్రతుకు తెరువులో, బూలతనం మీయెదుట నిలుస్తుంది.

ఈ నాగరాజు లాంటివారే మీ దృష్టికి తగలకపోవచ్చు. కాని సంఘంలో ఇటువంటి వ్యక్తుల కార్యకలాపాల స్వభావం యీ నవల విప్పి చెపుతుంది. తస్మాత్‌ జాగ్రత్త!

పేజీలు : 251

Write a review

Note: HTML is not translated!
Bad           Good