సాంకేతిక జిజ్ఞాస ఆదిమానవుడికి మొదటి నుంచీ ఉన్న లక్షణం. చీకటి నుంచి బయటపడటంకోసం ఉద్భవించినదే దీపం. వెలుతురు కోసం జరిగిన ప్రత్యామ్నాయ ఇంధన పరిశోధనల నుంచి వచ్చినవే నూనె ద్రవ్యాలు. ఆ పరిశ్రమకో పరాకాష్ట విద్యుత్తు. విద్యుత్తు ఉత్పత్తికి శ్రమించిన మొదటి శాస్త్రజ్ఞులు పాశ్చాత్యులు. ఎలక్ట్రోలిటిక్‌ పద్ధతిలో మొదటి బల్బును వెలిగించిన నాటి నుంచి ఈనాటి వరకూ విద్యుత్తు ఉత్పత్తిలో అనేక మార్పులు జరిగి ఇంటింటా దీపానికి, చీకటిని పారద్రోలడానికి దోహదం జరిగింది. అయితే మొదటి శాస్త్రజ్ఞులు పడిన శ్రమా, ఆనాటి ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఈనాడు విద్యుత్తును అనుభవించే వారెవరికీ తెలియదు. ఆనాటి శాస్త్రజ్ఞుల పరిస్థితులను సరళమైన తెలుగులో తెలియచెప్పారు డా|| సీతారామరెడ్డి.

- డా|| యన్‌.ఎస్‌.ప్రకాశరావు

Pages : 100

Write a review

Note: HTML is not translated!
Bad           Good