మొదటిభాగం విజయపురం
అడవి బ్రహ్మదత్తప్రభువు ఉత్తమకవి, ఉత్తమ సేనాపతి, ఉత్తమ రాజనీతివిశారదుడు.  అతనికి కవిత్వావేశం కలిగితే ఆంధ్రప్రాకృతంలో, దేవభాషలో అనర్గళంగా గాథలు, కావ్యాలు సృష్టిస్తాడు.  అటువంటి సమయాల్లో అతడు తన రాజనీతిని సేనాపతిత్వాన్ని మరచిపోతాడు.
అడవి బ్రహ్మదత్తప్రభువు ఆపస్తంబసూత్రుడు, కృష్ణయజరుర్వేదశాఖాధ్యాయి, విశ్వామిత్ర అఘమర్షణ దేవరాతత్రయార్షేయ సాంఖ్యాయనస గోత్రజుడు.  బ్రహ్మదత్తుని తండ్రి ధనకమహారాజు అడవి ప్రియబల మహాసేనాపతి, దేవదత్తాభిధానుడు.  బ్రహ్మదత్తప్రభువు తల్లి భరద్వాజగోత్రోద్భవ, పల్లవబుద్దీచంద్రప్రభువు తనయ సాంఖ్యాయనస గోత్రము, కౌశికగోత్రోద్భవము.
ఆంధ్ర శాతవాహనులు కౌశికగోత్రోద్భవులు.  విశ్వామిత్రసంతతి వారు.  కాబట్టే వారు తమతో సంబంధాలు చేయుటకని భరద్వాజులను వాసిష్ఠులను కాశ్యపులను మౌద్గల్యులను హరితసులను కుటుంబాలుగా కృష్ణాగోదావరీ తీరాలకు తీసుకొని వచ్చినారు.  వారందరు మహాంధ్రులైనారు.......

Write a review

Note: HTML is not translated!
Bad           Good