తెలంగాణలో విద్యావైజ్ఞానిక రంగాల అభివృద్ధికీ, సాంస్కృతిక పునరుజ్జీవనానికీ అలనాడు వైతాళిక గీతాలు ఆలపించి నిద్రాణమైన జాతిని మేలుకొల్పిన కొలదిమంది పుణ్య పురుషుల్లో అగ్రశ్రేణికి చెందినవారు ఆదిరాజు వీరభద్రరావుగారు. వారు పుట్టినది మధిర తాలుకా దెందుకూరు. ఐదవయేటనే తండ్రిగారు మరణించటంతో పెదతండ్రిగారి పర్యవేక్షణలో చింతకాణి వీధిలో ఓనమాల నుండి భారతంలో ''ఖర్జూరఫలములు గణికుండు కొనితెచ్చి'' భాగించే వరకూ, ఆంధ్రనామ సంగ్రహం నుండి అమరం వరకూ చదువుకొన్నారు. మరి కొంతకాలం కొణిజెర్లలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని అనాధలైన ఈ తల్లీకొడుకులూ తమ బంధువులైన రావిచెట్టు రంగారావుగారింట ఆశ్రయం సంపాదించుకొని 1900లో హైదరాబాదులో స్థిరపడ్డారు. సంపన్నులు, వదాన్యులు ఇలా దేశభక్తులు అందరికీ అది కూడలి. 1900-1901 నాడు వారి యింటనే - ఈనాటి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయానికి నాందీపూజ జరిగింది. ఆ సారస్వత సత్రానికి వచ్చిన పెద్దలకూ తాంబూలాలు పంచిన పిన్నవాడు ఆదిరాజు వీరభద్రరావుగారు....

Write a review

Note: HTML is not translated!
Bad           Good