ఆ "పాత్ర" మధురం - ఆ పాత మధురమే!
తెలుగు నవలా సాహిత్యంలో విశిష్టస్థానాన్ని పొందిన యాభై నవలల్లోని విలక్షణ స్త్రీ పాత్రలను 'ఆ పాత్ర మధురం' శీర్షికతో పాఠకులకు పరిచయం చేసారు రచయిత్రి శ్రీమతి భారతి. అల్పాక్షరాలలో అనల్పార్ధ రచన చెయ్యగలిగిన తిక్కన రచనను తలపింపచేస్తాయి ఈ పరిచయాలు. విస్తృతమైన రచనా పరిధిగల నవలల్లోని స్త్రీ పాత్రలను పొందిక చెడకుండా, రచయిత్రి లేక రచయిత ధేయ్యం స్పష్టంగా ప్రకటితమయ్యేలాగ అతి క్లుప్తంగా సమగ్రంగా పరిచయం చేసారు శ్రీమతి భారతి.---- సి. ఆనందారామం
"వెలుగుతున్న దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించగలదు" అన్న విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ సూక్తికి నిలువెత్తు సాక్ష్యం ముక్తేవి భారతిగారి పేరు చిరస్థాయిగా నిలిచివుంటుంది. నేను 'నది' కోసం సృష్టించిన 'ఆ పాత్ర మధురం' శిర్షిక ఇప్పుడు పుస్తకరూపం దాల్చి ప్రపంచం ముందు నిలుస్తుండడం నా అదృష్టం.
- ప్రభాకర్ జలదంకి (ఎడిటర్ ఇన్ ఛార్జి 'నది')

Write a review

Note: HTML is not translated!
Bad           Good