శివప్రసాద్‌ సాహిత్యంలోకి మొదట కథా రచయితగా ప్రవేశించారు. చాలా కథలకు బహుమతులు గెలుచుకున్నారు. కథకుడిగా ప్రసిద్ధులైన తర్వాత నాటక రంగంలోకి అడుగు పెట్టారు. బహుశా నాటకరంగ మిత్రులు తమకో నాటకం రాసి పెట్టమని కోరినప్పుడే ఆయన నాటకాలు రాయడం మొదలుపెట్టి వుంటారు. స్వతహాగా, మౌలికంగా కథా రచయితగావడం చేత ఆయనకు యితివృత్తాలకను యెన్నుకోవడం సహజంగా పట్టుబడింది. యితివృత్తానికి నాటకీయతను కల్పించడమూ అలవడింది. నాటికలోని పాత్రల్ని ప్రేక్షకులు సులభంగా గుర్తు పట్టగలిగేలా ఆయా పాత్రల భిన్న స్వభావాలను రూపొందించడమూ తెలిసి వచ్చింది. - డా|| మధురాంతకం నరేంద్ర

.... శివప్రసాద్‌ నాటికల్లో లేదా అతని మొత్తం రచనల్లో ఉపన్యాసాలు, ఉపదేశాలు, అనవసర చర్చలు, సాగతీతలూ వుండవు. అవసరమైనచోట రాజ్యాన్ని వ్యతిరేకిస్తాడు. నిత్య జీవితంలో మనకు కలిగే గాయాలను చూపెడతాడు. ఎక్కడా పరిష్కారాలు చెప్పడు. సూచించడు. శివప్రసాద్‌ది సవిమర్శక వాస్తవికతా ధోరణి. ప్రజా సాంస్కృతికోద్యమాన్ని బలపరచడమే అతని ధ్యేయం. అభ్యుదయ రచయితగా అతను ఎంచుకున్న మార్గం అది.

శివప్రసాద్‌ రచనలు సమాజం నుండి, జీవితం నుండి కళాత్మకంగా రూపొందినవి. రచనను సామాజిక బాధ్యతగా స్వీకరించాడు. గురజాడకు వారసుడు. కన్యాశుల్కం ఈనాటికీ ఏనాటికీ చూడటానికేగాక చదవటానికీ గొప్పగా వుండే నాటకం. ఇప్పుడు వస్తున్న అనేకం చూడటానికేగాక చదవటానీకీ అనుకూలంగా లేవు. చూడటానికి చదవటానికి పనికొచ్చే లక్షణాలూ, లక్ష్యాలూ వుండే నాటికలూ, నాటకాలూ అసలైనవనేది నిర్ధారిత సత్యం. శివప్రసాద్‌ ఈ రెండు విషయాల్లోనూ విజయం సాధించాడు. - పెనుగొండ లక్ష్మినారాయణ

''25 నాటికలు''లో యద్భవిష్యం, శ్రీముఖవ్యాఘ్రం, ఏక్‌ దిన్‌కా గరీబ్‌!, శ్రీచక్రం, హింసధ్వని, భూమిపుత్రుడు, ఇటునుంచి అటు, ఎడారి కోయిల, ఓనమాలు, సిరిజల్లు, ప్రేమాతురాణాం, ఏరువాక సాగాలి, మిస్స్‌డ్‌ కాల్‌, దేవుడా! దేవుడా!!,ఏకాకి నౌక చప్పుడు, ధ్వంసరచన, మనిషితనం, క్షతగాత్రగానం, ఒక మహాపతనం, పడుగు, దయచేసి తలుపులు తెరవండి, అమ్మసొత్తు, రంకె, ఆగ్రహం, స్వర్గానికి వంతెన అనే 25 నాటికలు వున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good