Search Criteria
Products meeting the search criteria
Balakrushna Satakamu
పిల్లలే దేవుడు, దేవుడే పిల్లలుగా భావించటం చేత రచయిత 'కృష్ణా' అంటూ సంబోధన చేస్తూ రాశారు. పెద్దలు బాలలను సత్ప్రవర్తనతో తీర్చిదిద్దాలి. చిన్నతనంలోనే మానసిక సంస్కారం అలవడేటట్లు చేయాలి. దానికై మంచి ఆహారపు అలవాట్లను, పరిశుభ్రతను, మనోనిగ్రహాన్ని, శాంతస్వభావాన్ని అలవాటు చేయాలి. జ్ఞానాన్వేషణ మార్గంలో తమ ఆలో..
Rs.40.00
Andhranayaka Satakam..
సాహిత్యపరంగా తెలుగువారికి దక్కిన భాగ్యవిశేషాలలో - శ్రీ కాసుల పురుషోత్తమ కవి ఆంధ్రనాయక శతకం ఒకటి. ఒక పోతన భాగవతం, ఒక విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షం తెలుగు వారికి ఎంతటి వైభవకారకాలో ఈ శతకం కూడా అటువంటిదే అనటంలో సందేహంలేదు. తెలుగులో భక్తి ప్రధానంగా అసంఖ్యాక శతకాలు వచ్చాయి. ప్రజల గౌరవాభిమానాలను అందుకుంట..
Rs.30.00
Kshetrayya Padaalu
క్షేత్రయ్య పదాలలో బహుభార్యాత్వం, వేశ్యాసంపర్కం, వ్యభిచారభావం లౌకికమైనవి కావు. అవి అలౌకికమైనవి. కృష్ణభగవానుడొక్కడే పురుషుడు. తక్కిన మానవులంతా స్త్రీలు. కృష్ణుడు పరమాత్మ. మానవుడు జీవాత్మ. ఈ జీవాత్మ పరమాత్మలో ఐక్యానుసంధానం కోసం పడే తపననే మదురభక్తి అంటారు. ఈ మధుర భక్తి రసరాట్టు. క్షే..
Rs.40.00
Vemana Satakam
వేమన పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ..
Rs.25.00
Suguna Shatakamu
సమకాలేన సమస్యలను వస్తువుగా తీసికొని , మానవీయ విలువలను చాటి చెపుతూ ఉద్దట్టమైన రచన చేశారు. శ్రీ నరసింహాచారి. అన్నమంతా పాట్టి చూడనక్కరలేదు అన్న చందాన్ కొన్నింటిని మాత్రమే ఉటంకిం చారు. శతకం మొత్తం చిత్తానికి హత్తుకునేలా ఉంది. భాష, శైలి, భావం, వ్యక్తీకరణ అన్నీ ఉత్తమంగా, ఉన్నతంగా సాగాయి. కవికి చందో వ్యా..
Rs.25.00
Kumara Satakam
19వ శతాబ్దం మధ్యకాలంలో ముద్రింపబడినప్పటినుంచి తెలుగు నాట విస్తృతంగా ప్రచారం పొందిన శతకాలలో కుమార, కుమారీ శతకాలు కూడా ఉన్నాయి. కాన్వెంటు చదువులు, ఇంగ్లీషు మాధ్యమాలు వచ్చిన తరువాత లేదుగానీ అంతకు ముందు ఈ శతకాలలోనివి, కనీసం ఒక పద్యమైనా నోటికి రాని బాలబాలికలు ఉండేవారేకారంటే అది అతిశయోక్తి కాదు. ఫక్కి అన..
Rs.20.00
Dasaradhee Satakam
తెలుగు భక్తి శతకాలలో కంచెర్లగోపన్న అనే భద్రాచల రామదాసు రచించిన దాశరథీ శతకానికి ఉన్నంత జనాదరణ మరి ఏ శతకానికి లేదు. తెలుగువారి దృష్టిలో దేవుడంటే తిరుపతి వెంకన్న తరువాత స్థానం భద్రాచలరామన్నకే. భక్తుడు అంటే రామదాసే. ఎందరు రామభక్తులున్నా రామదాసు మాత్రం ఒక్కడే. రామదాసు జీవిత చరిత్రను, భక్తిని, రాముని భక్..
Rs.25.00
Narasimha Satakamu
సంస్కృత వాజ్మయసాహిత్య ప్రక్రియలు తెలుగులో విలసిల్లినా, సంస్కృతానికి చెందినా, దేని ప్రత్యేకతలు దానివిగానే, తమ ప్రత్యేక వ్యక్తిత్వంతో, విశిష్టంగా విలసిల్లాయి. అలాంటి సాహిత్య ప్రక్రియలలో శతక ప్రక్రియ ఒకటి. నాలుగు వేలకు పైగా తెలుగు శతకాలు ఉద్భవించినా, పదిమందికి గుర్తుండిపోయేవి పది, ఇరవైని మించవు. సుమతి..
Rs.35.00
Shatakamanjari
తెలుగు శతకాలలో ఎంతో విలక్షణత, వైవిధ్యం , విశిష్టత కనిపిస్తుంది. ఈ శతక వాజ్మయం ఒకగని. దానిని త్రవ్వే కొద్దీ మణులు మాణిక్యాలు బయటపడతాయి. ప్రత్యేక లక్షణాలు మెరుపులు అద్బుతంగా ప్రదర్సితమవుతాయి. ఇలాంటి శతకాలను కొన్నింటిని అధ్యయనం చేసి వాని ప్రత్యేకతను తెలుగు భాష విశిష్టతను తెలుగు భాష ప్రేమికులు తెలుసుక..
Rs.200.00
Guvvalachenna Sataka..
చౌడప్ప, సూరకవులవలె ఈ కవి సమకాలిక సాంఘిక దురాచారములను, దుర్జనుల చిత్త వృత్తిని, విప్రుల దురాచారములను, నిశితముగా విమర్శించాడు. అల్పులు బాహ్యాడంబరముచే నిక్కుచున్నారని బ్రాహ్మణులు కులవిద్య వీడి పాశ్చాత్య వేషభాషలను అనుసరించి వారి నాగరికతపై ఆసక్తి వహిస్తున్నారని, ధనికులు వేశ్యాలోలురై ఉన్నారని, వ్యక్తులలో..
Rs.20.00
Kumaree Satakam
కుమారీశతకశైలి సరళ సుబోధకమైనది. బచ్చెము, నిమ్మలము మొదలైన మాండలికములు కొన్ని ఉపయోగింపబడ్డాయి. 'గవ్వలవలె దంతములు', 'ఆకులలో పిందెలరీతి' వంటి చక్కని ఉపమానాలతో, బాగా పరిచయంలో ఉండే శబ్ద ప్రయోగాలు, ధారాళమైన చక్కని శైలి మొదలైనవి ఈ శతకపు ప్రత్యేకత. ఆధునిక కాలంలో జీవనవిధానంలో వచ్చిన మార్పులను అనుసరించి కొన్ని..
Rs.20.00
Bhaskara Satakam
ప్రాచీన తెలుగు శతకాలలో ఒక్క సుమతీ శతకం తప్ప మిగిలినవి వేనిలో లేని ప్రత్యేకత ఈ శతకంలో ఉన్నది. ఇందులోని పద్యాలన్నీ అకారాది క్రమంలో ఉన్నాయి. ఆరుద్ర ఈ ఏర్పాటు బహుశ: బ్రౌన్ దొర చేయించాడేమో అని భావించారు. కవుల హృదయ క్షేత్రాలలో నీతిని ఉపదేశించాలనే ఆకాంక్ష, వారిలోని ఉపదేశపటిమ నీతి శతకాలను కూర్చేటట్లు చేస్..
Rs.25.00
Gopala Satakamu
హంసలదీవి వేణుగోపాలస్వామి ఎంతో మహిమ గల దైవం. 1977లో ఉప్పెన వచ్చి, కృష్ణజిల్లా దివిసీమ అతలాకుతలమైనప్పుడు, స్వామివారి ఆలయం చెక్కు చెదరకుండా ఉండటమే కాదు, ఆ ఆలయాన్ని ఆశ్రయించినవారు సురక్షితంగా ఉన్నారని లోక కథనం. హంసలదీవి గోపాలునిపై భక్తిప్రపత్తులున్న శ్రీ కాసుల పురుషోత్తమ కవి రచించిన శతకమిది. పురుషోత్తమ..
Rs.30.00
Sumatee Satakam
వానకు తడయనివాడు, సుమతీశతకంలో ఒక్క పద్యమైనా తెలియని తెలుగు వాడు ఉండడని చెప్పటం యథార్థం. ఇంగ్లీషు రైములకు ఇంత ప్రచారం వచ్చిన ఈ కాలంలో కూడా తల్లులు, పిల్లలకు ఒకటో రెండో సుమతీ శతక పద్యాలను నేర్పిస్తూనే ఉన్నారు. ఇంత విశేష ప్రచారం ఉన్న శతకమైనా దానిని ఎవరు వ్రాశారు అనే విషయాన్ని ఈ నాటికీ ఏ తెలుగు సాహిత్య ..
Rs.25.00
Bharthruhari Neeti S..
లక్ష్మణకవి తాను సుభాషిత రత్నావళి అనే చాటు ప్రబంధాన్ని పెద్దాడ సోమశంకర దేవుని ప్రేరణతో ఆ దేవదేవునికి అంకితంగా రచించినట్లుగా ఆ కావ్యపు అవతారికా పద్యాలలో తెలియజేశాడు. ఈ కవి పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తరార్థంలో కవి సార్వభౌముడని పేరు పొందిన కూచిమంచి తిమ్మకవికి సమకాలికుడు కావటం చేత పద్దాపురం పాలకుడు శ్రీవత్స..
Rs.25.00
Sree Kalahasteeswara..
'కాళహస్తి మాహాత్మ్యము' శ్రీకాళహస్తి క్షేత్ర మహాత్మ్యాన్ని తెలుపుతూ రచించబడిన ప్రబంధ శైలిలోగల గ్రంథం. కాళహస్తి క్షేత్ర మహాత్మ్యం సంస్కృత స్కాందపురాణంలోని శివ రహస్య ఖండంలోని కథ. కొద్దిపాటి కథను స్వీకరించి శ్రీకాళహస్తీశ్వర మహిమను తెలిపే పురాణ ప్రసిద్ధాలైన కథలను స్వీకరించి వాటిని అన్నింటిని శివభక్తి అన..
Rs.30.00
Sugunaadya Satakamu
నేటి సంక్షుభిత లోకంలో మనిషి కింకర్తవ్యమూఢుడై నిలబడి ఉన్నాడు. కర్తవ్యాకర్తవ్యముల యందు ప్రమాణబుద్ది కోల్పోయి ఉన్నాడు. మారుతున్న జీవన గమనాలు - విలువలు - అనివార్య మైన జీవన పోరాటాలూ - వీటి నడుమ ఆధునిక మానవుడు మహోదధి వంటి వాజ్మయరస ఫలానుభూతికి దూరం అయి విహ్వలుడు అవుతున్నాడు. అతనికి మంచి ఏమిటో..
Rs.100.00
Guvvalachenna Sataka..
ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నా ఆలోచించి చూస్తే అన్నీ తాగడానికి, తినడానికే. వెలకాంతలెందరైనను కులకాంతకు సాటిరారు, పలువిద్యలెన్ని నేర్చినా కులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా! ఆడపడుచుసంపదతో కడుపునింపుకుని నీల్గే మనిషి ఎవళ్ళకీ తెలియకుండా నూతిలో పడడం మంచిది. ఆడినమాటలు తప్ప..
Rs.25.00
Bommala Vemana Satak..
మన బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని పద్యాలకు టీకా, వివరణ. తేట తెలుగులో తోలి ప్రయత్నం. సచిత్రం. భాషలో నిరంతరం మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాలలకు పట్యగ్రంధాలు గ్రాంధిక భాషలో ఉండేవి. నేడు వ్యవహారిక భాషలో ఉంటున్నాయి. ఈ తరుణంలో గ్రాంధ..
Rs.35.00
Bommala Sumati Satak..
మన బాల బాలికల కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని పద్యాలకు టీకా, వివరణ. తేట తెలుగులో తోలి ప్రయత్నం. సచిత్రం. భాషలో నిరంతరం మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు బాలలకు పట్యగ్రంధాలు గ్రాంధిక భాషలో ఉండేవి. నేడు వ్యవహారిక భాషలో ఉంటున్నాయి. ఈ తరుణంలో గ్రాంధ..
Rs.35.00