Search Criteria
Products meeting the search criteria
Saibaba
ఆచరణే బోధనగా అవతరించిన అవధూత సాయినాథుడు. సుమున్నత గురుపరంపరలో ఆయన ఓ గౌరిశంకర శిఖరం. ఆ శిఖరాన్ని రచయిత తనదయిన కోణంలో దర్శించి, తరించి, సాయిలీలా విభూతుల్ని ఇందులో అక్షర సమార్చన చేశారు. ఈ ప్రయత్నం వెనుక పవిత్రత ఉంది. పరిశోధన ఉంది. అనేక గ్రంథాల్ని పరిశీలించి, సాయి అవతారాన్నీ, సద్గురు జీవిత..
Rs.250.00
Oka Hijra Atma Katha
ఈ భూమి మీద 1,53,24,000 ట్రాన్స్ జెండర్ వాళ్ళున్నారని అంచనా. అంటే కజఖిస్థాన్, ఈక్వెడార్, కాంబోడియా దేశాల జనాభా అంత. ఈ సంఖ్యను చూస్తే మనలో ఒక కొత్త ఆలోచన నాంది కలుగుతుంది. ఈ పుస్తకానికి పాఠకులను పట్టి చదివించే శక్తి, వాళ్ళ ఆలోచనను ప్రేరేపించే శక్తి వున్నది. అట్లాగే విస్మయ భీతిని కూడా కలిగిస్తుం..
Rs.150.00
Raalu-Rappalu
నిత్యం అభ్యుదయ శీలమైన జనం వెంట నడుస్తూ తన పాత అభిప్రాయాలను - అది తప్పని ఋజువైన వెంటనే - మార్చుకోటానికి వెనకాడకుండా జీవించిన వ్యక్తి ధర్మారావుగారు. దూరం నుంచి వీరి జీవితంలో కనిపించే అభిప్రాయాల వైరుధ్యాలనూ, చేసిన ఉద్యోగాల మధ్య ఉండే వైవిధ్యాలనూ పరికిస్తే ధర్మారావు గారి జీవితం - సాహిత్య జీవితం అనేక ఒడుద..
Rs.35.00
Kaasee Satakamu
'హరికథాపితామహ', 'ఆటపాటలమేటి', బహుభాషావేత్త, బహుగ్రంథకర్త, విజయనగరం సంగీతపాఠశాల ప్రథమ ప్రధానాచార్యులు శ్రీమదజ్ఞాడ ఆదిభట్ల నారాయణదాసుగారు 1914లో కాశీని దర్శించి సంస్కృతంలో చెప్పిన శతకం 'కాశీశతకం'. దాసుగారి భాషావైభవానికి, భావవైభవానికి ఈ శతకం ఒక ఉదాహరణ. సమకాలీన సామాజిక పరిస్థితులను కవిత్వంంలో పొం..
Rs.70.00
Olga Nunchi Gangaku
రచయిత గురించి... రాహుల్ సాంకృత్యాయన్ అంతర్జాతీయ విఖ్యాతి పొందిన పాళీ, సంస్క ృత భాషా పండితుడు. గొప్ప చరిత్రకారుడు, కార్యశూరుడు, సుమారు 10 సం||లు సుదీర్ఘ కాలాన్ని స్వాతంత్య్ర యోధులుగా కారాగారాల్లో గడిపిన త్యాగమూర్తి. లెనిన్‌గ్రాడ్ విశ్వవిద్యాలయంలో ప్రాచ్యభాషా బోధకుడుగా పనిచేసి ఖ్యాతినొందిన సుప్రసిద..
Rs.250.00
Oka Sex Worker Aatma..
"మాకు కావాల్సింది మీ దయా, దాక్షిణ్యాలు కాదు - మా స్తిత్వానికి గుర్తింపు. అయితే, జయశ్రీ లాంటి కొద్ది మంది తప్ప సాధారణంగా ఫెమినిస్టులు కూడా సెక్స్ వర్కర్లకు గుర్తిమ్పునివ్వటానికి ఇష్టపడటం లేదు. సెక్స్ అనేది కేవలం మగవాళ్ళ అవసరం మాత్రమేననీ, స్త్రీలకు దాని అవసరం లేదనీ అందరూ భావిస్తూ వ..
Rs.100.00
Divodasu - Lokasanch..
రాహుల్జీ మహాపండితుడే గాక ''త్రిపీఠికాచార్యుడు''-మార్క్సిస్టు మేధావి, స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న కార్యకర్త. పలుమార్లు జైలుకెళ్ళాడు. తన జైలు జీవిత కాలంలోనే రచనా వ్యాసాంగానికి ప్రణాళిక వేసుకున్నాడు. ఆ తర్వాత రైతుసంఘ నిర్మాణంలోనూ, పోరాటాల్లోనూ పాల్గొంటూనే గ్రంథరచనకు ..
Rs.200.00
Nenu Tirigina Darulu
తెలుగులో యాత్రాచరిత్రలు కొత్తకాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్రా చరిత్ర నుండి ఆదినారాయణ భ్రమణకాంక్ష దాకా రాహుల్ సాంకృత్యాయన్ లోకసంచారి నుంచి బి.వి.రమణ ట్రెక్కింగ్ అనుభవాలదాకా తెలుగు సాహిత్యప్రపంచాన్ని సుసంపన్నం చేసిన యాత్రాచరిత్రలెన్నో ఉన్నాయి. ఆ కోవలోనే వాడ్రేవు చినవీరభద్రుడు రాస్తూ వచ్చిన యాత..
Rs.150.00
Sweccha Aadilonu - A..
స్వేచ్ఛ అంటే ఏమిటి?దేని నుండి ఈ విముక్తి? ఎటు చూసినా అల్లకల్లోలమూ, సంఘర్షణలూ - ఏ ఒక్కరికీ శాంతీ, భద్రతా అనేవి లేకపోవడం - ప్రతి క్షణమూ ఆందోళనలతో నిండిపోయివున్న నిత్యజీవితం - ఇటువంటి వర్తమాన ప్రపంచంలో నివసిస్తున్న ఆధునిక మానవుడికి తన సమస్యల వైపు సుస్పష్టతతో చూసుకొమ్మనీ, వాటిని అర్తం చేసుకోవలసినదీ, పరి..
Rs.180.00
China Yatrikudu Fa H..
భారత చైనాల గొప్ప నాగరికతలను బౌద్ధధర్మం వేయి సంవత్సరాలకు పైగా సన్నిహితంగా కలిపి ఉంచింది. రాజకీయ, ఆర్థిక విషయాలతో సంబంధం లేకుండా కేవలం ధర్మం మీదే ఆధారపడిన ఇటువంటి అనుబంధం మానవసంబంధాల చరిత్రలో మరెక్కడా కానరాదు. రెండు దేశాలకు చెందిన పండితభిక్షువులు సంపుటాలకొద్దీ పవిత్రగ్రంథాలను చైనాకు తీసుకొనిపోయి సంస్..
Rs.75.00
Kaasi Yaatra
శ్రీ చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి రెండు తరాలపాటు ఆంధ్రదేశం ఆబాలగోపాలానికి అవధానమంటే ఏమిటో రుచి చూపించిన తిరుపతివేంకటకవులలో ఒకరు. షడ్దర్శనీవేది చర్ల బ్రహ్మయ్యశాస్త్రి గురువరేణ్యుల కటాక్షం పొందినవారు. వీరిని ఆదర్శంగా తీసుకొని తయారయిన కవులకు, అవధానులకు లెక్కలేదు. పాండవోద్యోగ విజయ నాటకాల ద్వారా విఱుగు తఱుగ..
Rs.120.00
Anantham - Sri Sri A..
'1930 దాకా తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది. ఆ తర్వాత నుంచీ దాన్ని నేను నడిపిస్తున్నాను. అప్పటినుంచీ తెలుగు సాహిత్యం చరిత్ర శ్రీశ్రీ స్వీయచరిత్ర'' - అని చెప్పుకున్నారు మహాకవి శ్రీ రంగం శ్రీనివాసరావు. అట్లా అనంతం అన్నది తెలుగు సాహిత్య చరిత్రే అవుతుంది. చలసాని ప్రసాద్ కూర్పుతో ఒక పుస్తకంగా వెలువడిన ..
Rs.225.00
Nirjana Vaaradhi
"ఓ మనిషికి జీవితం ఇన్ని పరిక్షలు పెట్ట గలదా?" అనిపించింది ఆమె ఆత్మకథ చదువుతుంటే. అంతకు మించి, వాటన్నింటినీ తట్టుకుని నిలబడ్డ ఆమె స్థైర్యం ఆశ్చర్యాన్ని కలిగించింది. పుస్తకం ముగించి పక్కన పెడుతుంటే, తొంభై రెండేళ్ళ కొండపల్లి కోటేశ్వరమ్మ మూర్తి పర్వతమంత ఎత్తున కనిపించింది...
Rs.100.00
Pagati Kala
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలలో బోధించబడుతున్న విషయాలు గానీ, విధానాలు గానీ బాలలకు చాలా హానికరమైనవిగా వున్నాయి. విద్యార్హతను పరీక్షలతోనూ, బహుమతులతోనూ, పోటీలతోనూ, కుస్తీ పట్లతోనూ కొలుస్తున్నారు. ఈ రకపు చదువు సంధ్యల ఫలితాలే ఈర్ష్య, ద్వేషం, దెబ్బలాటలు, అశాంతి, అసంతృప్తి, అదుపు తప్పటం, పరిస్థితి అస్థవ్యస్..
Rs.60.00
Kasiyatra Charitra
కాశియాత్ర చరిత్ర' గ్రంథ కర్త ఏనుగుల వీరస్వామయ్య 1780లో చెన్నపట్నంలో జన్మించారు. వీరు ఆంధ్ర నియోగి బ్రాహ్మణలు. శ్రీ వత్స గోత్రీకులు. తండ్రి పేరు సామయ మంత్రి. శాకియాత్ర చేయడం ఒక పవిత్ర ధార్మిక విధిగా ఆస్తికులు పరిగణిస్తారు. ప్రయాణ సౌకర్యాలు, రహదారులు లేని రోజుల్లో వీరస్వామయ్యగారు సకుటుంబసపరివారంతో ..
Rs.249.00
Madhura Swapnam
'సింహ సేనాపతి', 'జయ యౌధేయ' నవలల్లాగానే ఈ 'మధుర స్వప్నం' కూడా చారిత్రక నవల. 1944-45 సంవత్సరాల మధ్యకాలంలో నేను కొన్నాళ్ళు టెహరాన్ (ఇరాన్)లో వున్నాను. అప్పుడే ఈ నవలను వ్రాయాలని నిశ్చయించుకున్నాను. అప్పట్నుండి ఈ నవలకు అవసరమైన చారిత్రక విషయాన్ని సేకరించడంలో నిమగ్నుణ్ణయ్యాను. అయితే, 1949లో గాని ఈ నవలను..
Rs.210.00
Naa Yeruka
నా యెఱుక - శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు స్వీయ చరిత్ర శ్రీ ఆదిభట్ల నారాయణదాసు గారు (31-8-1864 :: 2-1-1945) నవరస విలసితమైన నవకళాప్రక్రియ హరికథకు ఆద్యులు. 1914లో శతావధాని చెళ్లపిళ్ల వేంకటశాస్త్రిగారి అధ్యక్షతన విద్వద్వరులు ''హరికథా పితామహ'' అన్నారు. 1928లో మద్రాసు విద్వాంసులు ..
Rs.150.00
Vismrutha Yaatrikudu
'విస్మృత యాత్రికుడు'లోని చాలా భాగాలు ఢిల్లీ నుండి వెలువడే 'సాప్తాహిక' 'హిందుస్థాన్' పత్రికలలో ధారావాహికంగా వెలువడ్డాయి. అవి చదివిన మిత్రులు అనేక మంది ఆసక్తిదాయకమైన ఉత్తరాలు వ్రాశారు. తమ తమ సందేహాలు వెలిబుచ్చారు. నేను వ్రాసిన ''సింహ సేనాపతి'' చదివి పీఠికలో వ్రాసిన 'యిటుకలను' దర్శించడానికి చాల..
Rs.280.00
Tibet Lo 15 Nelalu
భారతీయ సాహిత్యంలో యాత్రా చరిత్రకు పితామహుడు రాహుల్ సాంకృత్యాయన్. బౌద్ధ ధర్మానికి సంబంధించిన అరుదైన పుస్తకాలను సేకరించి, అనువదించే అన్వేషణలో రాహుల్‌జీ జరిపిన టిబెట్ యాత్రా విశేషాలను ''తిబ్బత్ మే సవాబరన్' పేరుతో 1934 సం||లో పుస్తకంగా ప్రచురించారు. ఎనిమిది దశాబ్దాల తర్వాత శ్రీమతి పారనంది నిర్మల ద..
Rs.220.00
Inkothi Kommachi - 2
(ఇం)కోతి కొమ్మచ్చి - ముళ్ళపూడివెంకట రమణ - బాపూ రమణీయం - రెండవ భాగం ''కోతి కొమ్మచ్చి'' (మొదటి భాగం) పుస్తకం పాఠకులనే కాదు, సమీక్షకులనూ మెప్పించింది. బతుకు పోరాటంలో ఎటువంటి కష్టాలు ఎదురైనా నవ్వుతూ బతకాలని బోధించిన జీవనవేదంగా - మొక్కవోని ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని నూరిపోసిన వ్యక్తిత్వ ..
Rs.150.00