మన జీవితంలో గాలి ముఖ్యమైనది. గాలి లేందే మనం జీవించలేం గాలి మనకు కనపడదు. దీని బట్టి గాలిని తాకిడికి చెట్లు కొమ్మలు ఆకులు కదులుతాయి. దీనిని బట్టి గాలిని పరోక్షంగా చూసినట్లువుతుంది.సహజ సిద్దమైన ప్రకృతి వనరు గాలి . దీనికి సరిహద్దులు , ఎల్లలు లేవు. గాలి అతివేగంగా వీస్తూ వాతావరణాన్ని అల్లకల్లోలం చేయడాన్ని తుఫాను అంటాము. ఎడారిలో ఇసుక తుఫానులు వస్తుంటాయి. గాలి వేగాన్ని కొలిచే సాధనాన్ని అనిమోమీటర్ అంటారు. మంచి గాలి మనలో ఉల్లాసాన్ని నింపుతుంది. మానవుడు గాలిలో ఎగరాలని అనేక సార్లు ప్రయత్నం చేసాడు. ఫలితంగా గాలి గుమ్మటాలు, విమానాలు, హెలికాప్టర్లు కనిపెట్టాడు. భూగర్భజలాలను తోడటానికి, విద్యచ్చాక్తి ఉత్పత్తి చేయటానికి అనేక దేశాలలో గాలి మరలను ఉపయోగిస్తున్నారు. నేడు వాతావరణ కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడకే ముప్పు వాటిల్లుతుంది. కాలుష్య నివారణకు ప్రపంచ అన్ని దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయి. |