సామాజిక విప్లవానికి పురోగామిగా సాహిత్యవిప్లవం సాగాలి అన్న శ్రీశ్రీ మాటలకు ఆచరణలో తన రచనల ద్వారా నిరూపించిన మహాకవి, రచయిత సి.వి. (చిత్తజల్లు వరహాలరావు). సి.వి. రాసిన ఆణిముత్యాల్లాంటి రచనల్లో స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ ఒకటి.
బ్రిటీష్‌వారు ప్రవేశించేనాటికి ''స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ'' భారతదేశంలో ఉండేదని మార్క్స్‌ అభివర్ణించారు. దీనికి ''ఆసియా తరహా ఉత్పత్తి విధానం'' (ఆసియాటిక్‌ మోడాఫ్‌ ప్రొడక్షన్‌) అన్నారు. ఆనాడు తనకు అందుబాటులో ఉన్న పత్రాల ఆధారంగా ఈ సూత్రీకరణ చేసారు.
స్వయం సంపూర్ణ గ్రామీణ వ్యవస్థ భారతదేశంలో ఉందా? లేదా? అనే చర్చోపచర్చలు నేటికీ ప్రపంచ, భారతదేశ చరిత్రకారుల్లో జరుగుతున్నాయి. అట్లాగే భూమిపై స్వంతహక్కు భారతదేశంలో ఎప్పుడు ఏర్పడింది? బానిస సమాజం యూరప్‌లాగానే ఇండియాలో ఏర్పడిందా? అనే వివాదాస్పద అంశాలున్నాయి. వీటన్నింటిని ఈ పుస్తకం చక్కగా వివరిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good