స్వార్థ చింతనతో కూడిన మానవ సంబంధాల్లో పరస్పర అవగాహన ఎంత ముఖ్యమో చెప్పే నవల శ్రీ ముక్తవరం పార్థసారథి రచించిన ‘మనసులోని చలి’
మధ్యతరగతి సంసారాల్లో సామాన్యంగా ఉండే కష్టాల్నీ, బాధల్నీ, వాస్తవికంగా చిత్రిస్తూనే, ఒక తాత్త్విక దృక్పథంతో, మానసిక విశ్లేషణతో రాసిన నవల ఇది.
ఈ నవలలో హృదయాన్ని స్పృశించే, మనస్సుని కుదిపే సహజమైన, అర్థవంతమైన సంభాషణల ద్వారా వివిధ మనస్తత్వాలను ప్రతిభావంతంగా చిత్రించడం జరిగింది. నిర్మలంగా ఉన్నట్లు కనిపించే సరస్సులోకి రాయి విసిరితే అది సృష్టించే అలలలాంటివి ఇందులోని సంఘటనలూ, సన్నివేశాలూ. తీసుకున్న ఇతివృత్తాన్ని సరళంగానూ, శక్తివంతంగానూ ఆవిష్కరించిన తీరు అభినందనీయం.
“వేదాంత గ్రంథాలలో” ఎంత చదివామన్నది ముఖ్యం కాదు, ”ఎంతవరకు అది మన జీవిత వైఖరిని మలచగలుగుతుందనేది అవసరం. ఎంత నిజాయితీతో మనం ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టగల మనేది ముఖ్యం” అన్న మాటలు ఆధ్యాత్మిక దృక్పథం ఉన్న వారందరికీ వర్తిస్తాయి.
జీవితం సంఘర్షణమయం కాకుండా ఉండాలంటే, ఎవరైనా చేయవలసింది అదే. ఒక ప్రయోజనకరమైన సందేశాన్ని సూచనాత్మకంగా అందించిన రచయిత పార్థసారథిగారికి అభినందనలు!
- అబ్బూరి ఛాయాదేవి
Rs.60.00
Out Of Stock
-
+