ఉత్తమ సాహిత్య విమర్శ' పురస్కారం (2012) పొందిన గ్రంథం.

భారతీయ-పాశ్చాత్య నాటక రచనా సంవిధాన విశ్లేషణ

విభిన్న ప్రక్రియావిశేషాల విమర్శనాత్మక వివరణ

వివిధ మాధ్యమాల తులనాత్మక పరిశీలన

''నాటకం అంటే ఏమిటి? దాని రూపురేఖలేమిటి? దానికీ మిగిలిన సాహిత్య ప్రక్రియలకు ఉండే సంబంధం ఎటువంటిది?'' అనే మౌలికమైన వివేచనతోపాటు అందుకు అవసరమైన భారతీయ, పాశ్చాత్య సిద్ధాంతాల సంక్షిప్త వివరణ కూడా ఇవ్వడం జరిగి ఈ పుస్తకంలో. ఇవ్వాల్టి రంగస్థల శాస్త్ర సమాలోచన అంతా పాశ్చాత్యుల పద్ధతిలో నడుస్తున్నది కనుక నటులు, దర్శకులు కూడా ఆ పద్ధతులనే అనుసరిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్ధుల కోసం ఉద్దేశించిన పుస్తకం కనుక నేను కూడా ఆ సిద్ధాంతాలనే ప్రాతిపదికగా స్వీకరించాను. అయితే, పాశ్చాత్యులు చెప్పని ఎన్నో విషయాలను, ఎంతో కూలంకషంగా చెప్పింది నాట్యశాస్త్రం. ఈ పుస్తకంలో ప్రతి అధ్యాయమూ పాశ్చాత్యుల భావనా క్రమాన్ని వివరిస్తూ ప్రారంభమైనా, దానికి సమాంతరమైన భారతీయ సిద్ధాంతాలను కూడా సాధ్యమైనంత వివరంగా ఇవ్వడం జరిగింది. ఆ తరువాత ఆ రెంటినీ సమన్వయించడంలో ఉన్న సాధకబాధకాలను వివరిస్తూనే ప్రతి అంశం మీద మనం స్వతంత్రంగా ఏర్పరచుకోవలసిన ఆలోచనా క్రమాన్ని, అవలంబించవలసిన పద్ధతులను గురించి చర్చించడం జరిగింది. నాట్యశాస్త్రంలో ఉన్న అనేకానేకమైన విషయాలను వివరిస్తూ అవి ఈనాటికీ ఎంత సమంజసమైన ఉత్తమ ప్రమాణాల్లో చూపడం జరిగింది. - రచయిత మొదలి నాగభూషణశర్మ

Write a review

Note: HTML is not translated!
Bad           Good