కాళిదాసు కావ్యాలలో రఘువంశం అనేక విధాల గొప్పది. ఆ మహాకవి కవితా మాధుర్యానికీ, ప్రతిభావ్యుత్పత్తులకూ, నికషోపలం ఈ కావ్యం! కనుకనే సంస్కృత విద్యార్ధులు మొట్టమొదట రఘువంశ కావ్యాన్ని విధిగా అధ్యయనం చేస్తారు. వారి వారి యోగ్యతనూ, అర్హతనూ బట్టి, విజ్ఞుల, అల్పజ్ఞుల హృదయాలను కూడా అలరిస్తుంది ఈ హృద్యమైన కావ్యం.

సకల కావ్యరత్నమని చెప్పదగిన రఘువంశానికి పలువురు వ్యాఖ్యలు రచించారు. వీటిలో మల్లినాథసూరి, హేమాద్రి, చారిత్రవర్థన, దక్షిణావర్త, సమితి విజయ, వల్లభ, ధర్మమేరు, విజయగణి, విజయానందసూరి చరణ సేవక, దినకర మిశ్ర ప్రభృతుల వ్యాఖ్యలు ప్రధానమైనవి.

అయితే కోలాచల మల్లినాథసూరి వ్యాఖ్యయందు తక్కిన వ్యాఖ్యలన్నీ దిగదుడుపు! కనుకనే అతని వ్యాఖ్య వచ్చిన తరువాత పూర్వపు వ్యాఖ్యాలన్నీ మూతబడ్డాయి!

'కాళిదాస గిరాం, సారం,

కాళిదాస: సరస్వతీ'-

అట్టివాడు కాళిదాసు. కనుకనే అతను కవికుల గురువు అన్నాడు పక్షధర మిశ్ర బిరుదాంకితుడు జయదేవకవి. ఈ గురువు అప్పటికీ ఇప్పటికీ- ఎప్పటికీ గురువే! ఏ శిష్యుడూ ఇంతవరకు గురువును మించలేదు!

రమణీయమగు రఘువంశ కావ్యాన్ని సాధ్యమైనంత సరళ శైలిలో వచనంగా వ్రాశాను. నిజానికిది సాహసమే! మూలంలోని సొగసు పోనివ్వకుండా పట్టుక రావాలని ప్రయత్నించాను. ఎంత వరకు కృతకృత్యుడనయ్యానో పాఠకులకే ఎరుక.- రెంటాల గోపాలకృష్ణ

Write a review

Note: HTML is not translated!
Bad           Good