హైందవ సంపదలో ఒక భాగం దేవాలయాలు. మన పూర్వీకులు అద్భుతమైన దేవాలయాలను ప్రయోగాత్మక రీతిలో నిర్మించినారు. వారి శిల్ప నైపుణ్యం, శిల్ప సంపద చరిత్రలో శాశ్వతంగా నిల్చినాయి. ఇవి భారతీయుల ఖ్యాతిని ప్రపంచ నలు దిశలకు వ్యాపింపజేశాయి. ఖండ ఖండాంతరాల నుంచి కళారాధకులను ఆకర్షించి, తమ వైభవాన్ని చాటుకున్నాయి. ముఖ్యముగా దక్షిణాది ప్రాంతము యొక్క ఆలయ నిర్మాణ శైలి ద్రావిడ సంస్కృతికి అద్దం పడతాయి. వైష్ణవాన్ని ఆరాధించిన ఆళ్వార్లు పెక్కు వైష్టవ ఆలయాలను సందర్శించి, మంగళా శాసనములు గావించినారు. అటువంటి ఆలయాలు భూమి మీద 106 వరకు ఉన్నాయి. ఇవి దివ్య దేశాలుగా ఖ్యాతి పొందినాయి. వీటిని కొంత మంది దివ్య తిరుపతులుగా కొలుస్తారు. వీటి సమాచారం క్లుప్తంగాను, భారత యాత్రా సమాచారం సమగ్రంగాను పొందుపర్చడం జరిగింది. యాత్రా గైడ్‌ నందు చుట్టు ప్రక్కల గల పవిత్ర క్షేత్రాలు, యాత్రా స్ధలాలు, పర్యాటక స్ధలాలు మొదలగు చూడదగిన యాత్రా సమాచారం పుస్తకం నందు చోటు చేసుకున్నాయి. ''దివ్యదేశాలు'' సమాచారంను సేకరించుటలో తోడ్పడిన చి||సౌ|| శివప్రియ ప్రసాద్‌కు నా ఆశీస్సులు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good