ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర జా క్రిస్తోఫ్‌ క్రాఫ్ట్‌. ఆయన జర్మనీలో పుట్టి, ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మ్యూజికల్‌ జీనియస్‌. మూల రచయిత రోమా రోలా. ఈయన ఫ్రెంచివాడు. సంగీత దిగ్గజం బితోవెన్‌ జీవితం ఆధారంగా క్రిస్తోఫ్‌ పాత్రను ఆయన సృష్టించాడంటారు. ఒక దేశ కళాకారుడు మరో దేశంలో పేరు గడించడంలో ఆశ్చర్యం లేదు. కళాకారులక సరిహద్దులు అడ్డురావని చెప్పడమే రచయిత ఉద్దేశం. సంగీత సాహిత్య సాంస్కృతిక రాజకీయ చర్చలతో, విశ్లేషణలతో ఏకంగా ఒక ఎన్‌సైక్లోపిడియాని తలపిస్తుంది మూల రచన. 1904-12ల మధ్య పది సంపుటాలుగా వెలువడిన జా క్రిస్తోఫ్‌ అనే ఈ మూలరచన రెండు వేల పేజీలకు మించిన మహాకావ్యంగా సాగింది. ఇది 1915లో రచయితకు నోబెల్‌ బహుమతి తెచ్చిపెట్టింది. తెలుగులో సంక్షిప్తంగా మానవుడు అనే పేరుతో అందించారు, కీ.శే. విద్వాన్‌ విశ్వం. దానినే ఇప్పుడు మీ ముందుంచుతున్నాం. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good