సరళ సుందరమైన వచనరచనకు పురిపండా పెట్టింది పేరు. ఒక్కచేతి మీదుగా భారత, భాగవతాలను పద్యకావ్యాలుగా చేసినవారున్నారు. కాని వచనంలో రామాయణం, భారత, భాగవతాలతోపాటు దేవీభాగవతం సహితం రచించి మెప్పించడం అంటే అది 'అనితరసాధ్యమే'నని ఒక్క పురిపండావారే నిరూపించారు. 'పురిపండా వచన రచనలు'గా ఒక ప్రత్యేక శైలితో అలరారే ఈ నాలుగు గ్రంధరాజముల ముద్రణ భాగ్యం మాకు లభించింది. నిన్నటి తరానికి - నేటి తరానికి వారథిగా, జీవితాంతం, ఖద్దరునే ధరించిన గొప్ప దేశ భక్తుడుగా, ప్రజల నాల్కలమీద నర్తించే భాషను కావ్యేతిహాసాలకు అన్వయించి వడుక భాషకు కావ్యగౌరవం కల్పించిన విశిష్టసంస్కర్తగా శ్రీపురిపండా అప్పలస్వామి చేసిన భాషా సేవ అనన్యమైనది.
ఆధునిక కవితావైతాళికుడు శ్రీశ్రీ. ''నన్ను అచ్చోసి ఆంధ్రదేశంమీదికి వదిలింది పురిపండా'' అని తన ఆత్మచరిత్ర ''అనంతం''లో సగర్వంగా చెప్పుకున్నారు.
Rs.720.00
In Stock
-
+