చరిత్ర పుటల్లో ఎందరో అలెగ్జాండర్‌లు. అయితే క్రీ పూ. 3వ శతాబ్ధంలో మసెడోనియా రాజవంశీకులు ఫిలిప్-2, ఒలింపియాసిన్‌లకు జన్మించిన అలెగ్జాండర్ మాత్రమే 'ది గ్రేట్' అని మాత్రమే పిలవబడ్డాడు.

ఫిలిప్-2 అలెగ్జాండర్‌ని తన వారసుడిగా ప్రకటించి అతడికి అక్కడి పండితులతో విద్యాబుద్ధులు గరపడమేగాక గ్రీక్ ప్రసిద్ధ తత్త్వవేత్త అరిస్టాటిల్‌ను ఏథెన్స్ నుండి రప్పించి తన కుమారుడికి ఉన్నత విద్య బోధింపజేసాడు.

తండ్రి మరణం తర్వాత మసెడోనియా సేనలకు నాయకత్వం వహించి గ్రీక్ రాజ్యాలలోని తన వ్యతిరేకులను అణచి అంతకుముందు పెర్షియా సామ్రాజ్యాధినేతలచే అణగద్రొక్కబడిన గ్రీకు రాజ్యాలకు నాయకుడయ్యాడు.

ఆ తర్వాత పెర్షియా సామ్రాజ్యంపై దండెత్తి ఆ సామ్రాజ్యాన్ని కూకటివ్రేళ్లతో పెకలించి, పెర్షియా సామ్రాజ్యమే తనకు తెలిసిన ప్రపంచానికి చివరి అంచు అని భావించి అందులో భాగమైన గాంధారం (ఇప్పటి ఆఫ్‌ఘనిస్తాన్) కూడా జయించి భారతదేశంలో అడుగిడి పంజాబ్ వరకు తన జైత్రయాత్ర కొనసాగించాడు.

ఇంత చిన్న వయసులో ఇంతటి గొప్ప మహాసామ్రాజ్యాన్ని నిర్మించి, తన 33వ ఏట మరణించి చరిత్ర ప్రసిద్ధుడైన 'అలెగ్జాండర్ ది గ్రేట్' స్థూల జీవన చిత్రణే ఈ రచన.

Write a review

Note: HTML is not translated!
Bad           Good