గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతిభావంతులైన విద్యార్ధిని వెలికితీయటానికి ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజిలు ఎలా ఉపకరించగలవో డా.కలాం ఈ పుస్తకం ద్వారా తెలియచెప్తున్నారు. 2020 నాటికి భారతదేశంలో పాఠశాలలు ఉపాధ్యాయుల్నీ, విద్యార్ధుల్నీ, సమాజాన్నీ అనుసంధానపరిచే సజీవ అభ్యసన కేంద్రాలుగా ఉండాలని ఆయన కలగంటున్నారు. ప్రపంచమంతట్లోనూ పెంపొందిన సమస్త జ్ఞానం భారతీయ పాఠశాలలకి ప్రవహించాలని ఆకాంక్షిస్తున్నారు. ఈ కల నెరవేరాలంటే పాలనా ప్రమాణాలు మెరుగుపడాలనీ, పౌర సంస్ధల గౌరవం పరిరక్షించబడాలనీ ఆయన హెచ్చరిస్తున్నారు.
సమకాలీన గ్లోబల్‌ ప్రపంచంలో జ్ఞానం వికసిస్తున్న ప్రక్రియను ఈ పుస్తకం ఒక చెట్టుతో పోలుస్తుంది. మనిషి తన జీవింతంలో వివిధ దశల్లో కౌమారదశ, వయోజనదశ, ఏభైఏళ్ళ తరువాత అనుభవంతో కూడుకున్న వార్ధక్యదశల్లో మనిషి ఏవిధంగా వివిధ రకాల పద్ధతుల్లో జ్ఞాన సముపార్జన చేయవచ్చో, తద్వారా సత్ఫలితాలు సాధించవచ్చో ఈ పుస్తకం వివరిస్తుంది.
ఎందరో భారతీయ శాస్త్రవేత్తలూ, కళాకారులూ ఈ దేశానికి అందించిన మహత్తర ప్రదానాలను ఈ పుస్తకం సందర్భోచితంగా వివరిస్తూ జీవితంలో వికసించటానికి వయసు అడ్డంకి కాదని నిరూపిస్తుంది. వ్యక్తులోని ప్రతిభావైవిధ్యం వికసించే వాతావరణం కల్పించడం, ఒక తోటను పెంచి పోషించడం లాంటిదని వివరిస్తూ డా.కలాం మన వ్యవస్ధలను రూపొందించుకొనే క్రమంలో మన సామాజిక నైతిక విలువలకు పెద్దపీట వేయాలని, అందుకుగాను ఏకాభిప్రాయం అంతరాత్మప్రభోదాలతో పెంపొందే శాస్త్రీయ నిరతి కావాలిన జాతికి పిలుపునిస్తున్నారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good