అయితే ఈ నాటికి తెలుగుజాతి , భాషా సంస్కృతులు పరిస్థితి ఏమిటని విచారిస్తే వాటిపై ఏ కించిత్ అభిమానమున్న వాడికైనా మనసులో బాధ కలుగక తప్పదు. తెలుగు వారికి వారి బషపైన , ఆచార వ్యవహారాల పైన , ఇతర సాంకృత్తిక కార్యక్రమముల పట్ల  నిర్లక్షము , నిరాదరణ , నూన్యతాభావము పెచ్చు పెరిగిపోతున్నది. ఆంగ్లేయుల పాలనా కాలము నందుకంటే స్వాతంత్ర్యానంతరము ముఖ్యంగా ప్రాపంచి కరణ విధానము మన దేశంలో మారుమూల గ్రామములకు కూడా వ్యాపిస్తున్న తరుణంలో పాశ్చాత్య నాగరికత పట్ల ఆంగ్ల బాష పట్ల అభిమానము అవధులు దాటటంతో పాటు ఒక్క ఇంగ్లీష్ పదమైనా ఉపయోగించుకుండా తెలుగు మాట్లాడ లేక పోవడం కట్టుబొట్టు అలవాట్లు పూర్తిగా పాశ్చత్యనగారికత ప్రభావమునకు పరిమితమవటం ఏంటో శ్రీఘ్రగతిలో జరిగిపోతుంది.ముందుగా మనవి చెసినట్ల తెలుగు జాతి చరిత్ర , భాష, సంస్కృతి , సంప్రదాయముల ప్రాచీనత, ఔన్యత్యము తెలుసుకోనవలేనన్నే జిజ్ఞాస గలిగిన తెలుగు వారు తప్పక చదవ వలసిన పుస్తకమిది. ఈ గ్రంధం పాఠకులకు ద్వారా లభించే ప్రోత్సాహమును బట్టి ఆధునిక యుగములో కూడా లబ్ద ప్రతిషులైన తెలుగు తాత్త్వకులకు గురించి వ్రాయవలేననే సంకల్ప మున్నది. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good