తల్లి దండ్రులు మీ పైన అనేక ఆలోచనలు, బాధ్యతలు పడతాయి. తల్లి దండ్రులుగా ఉత్తమ సంతానానికి జన్మ నిచ్చిన తదనంతర కర్తవ్యాలు ఏమిటి? మన పిల్లల యెడల మన పవిత్రమైన బాద్యతలు ఏమిటి ? పిల్లలు మనకు ప్రాప్తించిన ప్రక్రుతి వరాలు. వారు అత్యంత అమాయకులు. మన అజ్ఞానం చేత, తెలివిలేని తనం చేత, మనకు సాధారణంగా వున్నా బలహీనతల చేత, తిరస్కారభావంతో చూస్తాము. మాటి మాటికి అవమానిస్తూ కొడుతూ, తిడుతూ, చెప్పిన మాట వినడం లేదని దండిస్తూ వుంటాము. మన పిల్లల బంగారు భవిష్యత్ కు, రూపశిల్పుల మనమే. వాటిని తీర్చి దిద్దే ప్రక్రియలో అనేకమైన అనుమానాలు సమస్యలు ప్రతిబంధకాలు, ఎన్నో యదురౌతువుంటాయి. ఈ పంపకంలో తల్లి ద్రండ్రులు తోటమాలులు, తోటలోని మొక్కలు సక్రమంగా పెరిగి మంచి పుష్పాలను, ఫలాలను అందించాలంటే తోటమాలి ప్రణాళికా బద్దమైన నిరంతర కృషి అత్యంత అవశ్యకరమైనది.మన పిల్లలను మనకన్న మిన్నగా, ఆదర్శవంతులుగా, ఉత్తమాభిరుచులతో, మనకన్నా శక్తి సామర్ధ్యాలతో పెంచగలగాలి. అట్టి పెంపక ప్రక్రియలోని అనేక విషయాలను నా 40 సం || విద్యారంగ అనుభవాలతో అనేకమైన మానసిక , విజ్ఞాన శాస్త్రవేతాలందించిన విజ్ఞానంతో , వార్తా పత్రికలు అందించిన వేశేష పరిజ్ఞానంతో అందించిన సమాహారమే ఈ ఉత్తమ తల్లి దండ్రుల ఎసేషియాల్ -99 . అంటే ఉతమమైన పిల్లలను తయారు చేయాలంటే ఉత్తమైన తల్లి దండ్రులుగా మీరు ఎలా జీవించాలో తెలియాలి. ఈ విషయాలు నిభంధలను మేరు తప్పక అవలంభించాలి.మనము ఎటువంటి సమస్యలను ఎదుర్కొనుచున్నాము వాటికి పరిష్కార మార్గాలేమిటి ? మున్నగు అనేక అంశాలను, శాస్త్రీయ దృక్పధం తో ఆలోచించి సమర్పించు కున్నదే ఈ ఉత్తమ తల్లి దండ్రులకు ఎసేషియాల్ -99.

Write a review

Note: HTML is not translated!
Bad           Good