క్రీ.పూ. 3వ శతాబ్ధములో పుట్టి, చాణక్యుడు 'విష్ణుగుప్తుడు' 'కౌటిల్యుడు' అని కూడా పిలవబడ్డాడు.
నిర్వాహకము, ఆర్ధిక శాస్త్రము, రాజకీయము, చట్టము, నాయకత్వము, రాజరికము, యుద్ధతంత్రము, సైన్య తంత్రము, లెక్కలు వ్రాయపద్ధతులు లాంటి అనేక విశేష రంగములలో నిపుణుడైన, అరుదైన, మహా తెలివిమంతుడని, శతాబ్ధాలుగా, విద్వాంసులు వివరించారు. చాణక్యుడే, ఈ 6000 సూత్రాలను 15 పుస్తకములు, 150 అధ్యాయములుగా, 180 విషయాలుగా వివరించారు.
అతను తన జీవితకాలపు పనులను, తన పుస్తకమైన కౌటిల్యుడి అర్ధశాస్త్రము, మరియు చాణక్యనీతిలో వ్రాసిపెట్టాడు. ఆధ్యాత్మిక విలువలపై ఆధారపడిన బలమైన ఆర్ధిక స్ధితిలో కూడిన దేశములను నిర్మించుటకు, చాలా కాలముగా ప్రపంచంలోని మారుమూల పాలకులు అర్ధశాస్త్రమును అనునయించారు. శ్రీ రాధాకృష్ణన్ పిళ్లై రచించిన ఆంగ్ల గ్రంధానికి తెలుగు అనువాదముతో మనకు అందించినది సి.ఎస్.రామలక్ష్మీ మరియు బృందము.