తెలుగు పద్యాలపై ఆసక్తిగలవారూ, తెలుగు భాషాభిమానులూ తప్పక చదవాల్సిన పద్యాలు ఈ పుస్తకంలో పొందుపరచబడ్డాయి. ఇందులో మన పురాణ గ్రంథాలు, కావ్యాలు, శతక సాహిత్యంలోని కురువృద్ధుల్‌, గురువృద్ధ బాంధవులనేకుల్‌.. వచ్చినవాడు ఫల్గుణు డవశ్యము గెల్తుమనంగరాదు.. ధనమును విద్యయు వంశం.. అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూల పుటమ్మ చాలా బెద్దమ్మ... కుప్పించి యెగసిన కుండలంబుల కాంతి.. చేతులారంగ శివుని పూజింపడేని.. మందార మకరంద మాధుర్యమున దేలు... ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి... కమలాక్షునర్చించు కరములు కరములు... వారిజాక్షులందు వైవాహికములందు.. నల్లనివాడు పద్మనయనంబులవాడు... చిన్నారి పొన్నారి చిఱుతకూకటినాడు రచియించితి మరుత్తరాట్చరిత్ర.. సిరిగలవానికి చెల్లును తరుణుల పదియారువేల తగ పెండ్లాడన్‌... బావా ఎప్పుడు వచ్చితీవు?... చెల్లియో చెల్లకో చేసిన ఎగ్గులు సైచిరందరున్‌... కనకపు సింహాసనమున శునకము...(సుమతి) అల్పుడెపుడు పల్కు ఆడంబరముగాను...(వేమన) సందు దొరికెనేని సడియు చప్పుడులేక మేతమేయువాడు నేత యగునే? (నార్ల)...మొదలగు 250లకుపైగా ప్రసిద్ధ తెలుగు పద్యాలున్నాయి. మన తెలుగు సాహిత్యంలోని మధురమైన పద్యసంపద ఈ పుస్తకంలో వుంది. పద్యాలపై ఆసక్తిగల వారికీ, తెలుగు భాషాభిమానులకూ ఈ పుస్తకం ఓ పద్యాలవిందు ! ఆరగించితే దిల్‌ పసందు !!

Write a review

Note: HTML is not translated!
Bad           Good