"ఆ మధ్య ఎవరో అడిగారు సుగుణా ఈ ప్రపంచంలో అత్యంతంగా ప్రేమించేవ్యక్తి ఎవరూ అని... దానికి నేనేం జవాబు చెప్పానో తెల్సా?" అన్నాడు మురళీకృష్ణ.

"ఏ చెప్పుంటారు.... నా భార్య సుగుణ అనిజెప్పుంటారు" క్యాజువల్‌గా అంది సుగుణ.

"పోలీసువాళ్ళంటే రాక్షసులనే నా అభిప్రాయాన్ని తుడిచేయ్యడంతో పాటు మీమీద ప్రేమనీ గౌరవాన్నీ మరింత పెంచారు. మీరంటే మీకిష్టం అనేదాన్ని నేను ఒప్పుకుంటున్నా. మీ తర్వాత ఇష్టమైంది నేనేగా?".

హత్యచేసిన సుగుణేనా తన భర్తతో ఇంత చలాకీగా చలోక్తులు విసురుతూ మాట్లాడుతుంది అనిపిస్తుంది. పోన్లే ఆ సంఘటనని ఒక పీడకలలా మర్చిపోదాం అనుకున్నారు. సుగుణ చేసిన హత్యసంగతి తెల్సిన మాలీ, హరిబొంధూ, జగన్నాథం.

కణకణమండే రాక్షసి బొగ్గుని పచ్చని గుడ్డతో గట్టారనీ, ఏదో క్షణాన గుడ్డకాలి పొగతో మొదలై తర్వాత మండుతుందని తెలియదు వాళ్ళకి. చేసిన హత్యని సమాధిచేస్తే దానిపై మొక్కలు మొలిచి పూస్తున్న పూలు ఆ చుట్టూ వున్న ప్రకృతంతా పరిమళించి రహస్యాన్ని బయట పెడతాయని తెలీదు వాళ్ళకి. రాహువు రాబోతుందని తీతువు కూస్తున్న సంగతి తెలీదు వాళ్ళకి....

Write a review

Note: HTML is not translated!
Bad           Good