మౌనంగా శూన్యంలోకి చూస్తున్న మహీధరభూపతినే ఆశ్చర్యంగా చూస్తున్నాడు హిమాలయ్‌. అతనెప్పుడూ తన తాతను అంత గంభీరంగా చూడలేదు.

''చినబాబూ! కనీ వినీ ఎరుగని దారుణం ఒకటి ఈ రోజు ఉదయం గ్రామంలో జరిగింది'' నాందీ ప్రస్తావనలాగా అన్నాడు రంగస్వామి.

''ఏమిటిది'' కుతూహలంగా అడిగాడు హిమాలయ్‌.

''జాంబీ అనే రైతు నిన్న రాత్రి అకస్మాత్తుగా చనిపోయాడు. ఊరిపెద్దల సమక్షంలో అతని శవాన్ని శ్మశానంలో పూడ్చిపెట్టారు. అయితే ఈ రోజు ఉదయం అతను గ్రామం మీద దాడి చేశాడు. అతని సొంత భార్యనే గొంతు కొరికి చంపాడు. అడ్డొచ్చిన ఇద్దరు గ్రామస్థుల్ని పంజాలతో చీరినట్టు చీరి చంపేశాడు''.

అదిరిపడ్డాడు హిమాలయ్‌ ఆ విషయం విని.

''అదెలా సాధ్యం? చనిపోయినవాడు తిరిగి బ్రతికొచ్చాడా ? అసాధ్యం. ఇన్నివేల సంవత్సరాల మానవ జీవిత చరిత్రలో ఇది ఎప్పుడూ జరగలేదు'' పట్టరాని ఆశ్చర్యంతో తలమునకలవుతూ అన్నాడు హిమాలయ్‌.

''అవును. ఇదివరకు ఎన్నడూ ఈ విధంగా జరగలేదు. ఇప్పుడు జరిగింది. అందుకే రాజావారు ఇలా ఉన్నారు'' అన్నాడు రంగస్వామి నిస్తేజంగా.

''నో,నో, చచ్చినవాడు బ్రతకడం అసంభవమని, చరిత్రలో ఎందరో మహామేధావులు. మహావైద్యులు చచ్చినవాడిని తిరిగి బ్రతికించడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కాని ఎవరూ సాధించలేకపోయారు. చనిపోయిన జీవిని తిరిగి బ్రతికించడమంటే ప్రకృతిని పూర్తిగా జయించడమే. సృష్టికి ప్రతిసృష్టి చేయడమే. అది జరగని పని'' స్థిరంగా అన్నాడు హిమాలయ్‌.

అప్పుడు మహీధరభూపతి ''సృష్టికి ప్రతిసృష్టే జరిగింది చినబాబూ! ప్రపంచంలో మరో విశ్వామిత్రుడు పుట్టాడు. వాడు ప్రకృతినే జయించాడు. అందుకే చచ్చినవాడు మళ్ళీ బ్రతికాడు'' అన్నాడు గంభీరంగా. నమ్మనట్లే చూశాడు హిమాలయ్‌. ''ఆ విశ్వామిత్రుడు ఎవరో కాదు. నీ తండ్రి డాక్టర్‌ విశ్వామిత్ర భూపతి''.

''నా తండ్రా!'' విభ్రమంగా అడిగాడు హిమాలయ్‌.

ప్రకృతిని జయించాలనుకునే మానవుడి తపనను దాని పర్యవసానాన్ని తనదైన ప్రత్యేక శిల్పంతో చెప్పారు శ్రీ సూర్యదేవర రామ్‌మోహనరావుగారు తమ నవల మృత్యుంజయుడులో.

Write a review

Note: HTML is not translated!
Bad           Good