'ఏం చేశారు సాబ్‌? ఎవరినైనా కొట్టి వస్తున్నారా?'' రియల్‌ వ్యూ మిర్రర్‌లో అతన్ని చూడటానికి ట్రై చేస్తూ అడిగింది ఆటోని నడిపే ఆ పడుచు.

'నీకు ఎలా తెలుసు? ఆశ్చర్యంగా అడిగాడు కిరణ్‌

'బావన్‌ బస్తీ యాదయ్య మనుష్యులు వాళ్ళు, ఊరికే వీధిలోకి రారు!' తలతో వెనక్కి చూపిస్తూ చెప్పింది.

మీరు నా ఆటో ఎక్కినట్లు వాళ్ళకి తెలియలేదు. తెలిస్తే వాళ్ళు కూడా ఆటోల్లో వచ్చేస్తారు'' చిన్నగా నవ్వుతూ చెప్పిందా పడుచు.

ఆ మాటలతో ఈ లోకంలోకి వచ్చి ప్యాంట్‌ జేబులో వున్న హ్యాండ్‌కర్ఛీఫ్‌తో ముఖం తుడుచుకున్నాడు కిరణ్‌.

'ఎక్కడికి పోవాలి సాబ్‌?' ఆటోని ఇంకో వీధిలోకి మరలించి స్లో చేస్తూ అడిగిందా పడుచు. తనువిడిది చేసిన ¬టల్‌ పేరు చెప్పబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయాడు కిరణ్‌. నోటికి వచ్చిన ఒక చౌరస్తా పేరును మాత్రం చెప్పాడు.

'అది కూడా యాదయ్య మనుషులు కనిపించే ప్రదేశమే. మీరు అక్కడ దిగడం మంచిది కాదు' అంటూ అతను చెప్పిన ప్రదేశానికి ఆపోజిట్‌ దిశలో వున్న ఇంకోసెంటర్లో ఆటోని ఆపింది ఆ పడుచు.

కిరణ్‌ విడిది చేసిన ¬టల్‌ అక్కడికి వంద అడుగుల దూరంలోనే ఉన్నది. తన చేరవలసిన చోటుకు తీసుకురావటం యాదృచ్ఛికంగా జరిగిందో, లేక కావాలనే ఆమె అక్కడికి తీసుకు వచ్చిందో అర్థం కాలేదు కిరణ్‌కి. 'సార్‌, మీరు ఏమి అనుకోనంటే ఒక మాట చెపుతాను' ఆటోని ముందుకి కదిలించబోతూ, బ్రేక్‌ మీద కాలువేసి ఉన్నట్లుండి అన్నది ఆమె. - ఏమన్నదీ తెలుసుకోవాలంటే తానే రాసిన శంకర్‌దాదా రెండవభాగం చదవండి అంటున్నారు మధుబాబు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good