లాల్‌మణి జోషి భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన బౌద్ధ సారస్వత పండితులు. వీరు పంజాబు విశ్వవిద్యాలయంలో Department of Religious Studiesకు ఆచార్యులుగా, అధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. వీరి ఇతర రచనలు: Studies in the Buddhistic Culture of India (1967, 1977), Facets of Jaina Religiousness in Comparative light (1981), Discerning The Buddha (1983)
సారనాథ్‌లోని టిబెటన్ బుద్ధిస్ట్ హయ్యర్ స్టడీస్‌వారు, ప్రతి సంవత్సరం లాల్‌మణి జోషి పేరిట బౌద్ధం మీద ప్రఖ్యాత బౌద్ధ పండితులచేత స్మారకోపన్యాసాలను ఇప్పిస్తున్నారు.
అన్నపరెడ్డి బుద్ధఘోషుడు బౌద్ధ సాహిత్యంలో విశేషకృషి చేసి మహాబౌద్ధ విజ్ఞాన సర్వస్వ నిఘంటువు, నేటి ప్రపంచానికి బౌద్ధం, మానవీయ బుద్ధ మొదలైన 15 గ్రంథాలను వెలువరించారు. బుద్ధుని దీర్ఘ సంభాషణలు (2003) లో విడుదలైంది. ప్రస్తుతం బుద్ధుని మధ్యమ సంభాషణలు (మజ్జిమ నికాయ) అనువదిస్తున్నారు. బౌద్ధ సాహిత్య ఆంధ్రీకరణలో విశేష కృషి చేస్తున్నారు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good