సకాలంలో వానలు కురవక, సాగునీరందక , పంటలు పండక్, పండిన పంటలకు గిట్టుబాటు ధా పలకక, అప్పుల పాలై రైతాంగం సంక్షోభంలో పడింది. గిట్టుబాటు కాని వ్యవసాయ రంగాన్ని నమ్ముకోలేక, బతుకు తెరువు కోసం ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటూ రైతు పట్టణాల దారి పడుతున్నాడు. కాయలో, పండ్లో, గింజలో పండించి అమ్ముకొని బతకాల్సిన రైతు తన ఒంట్లో అవయవాలను అమ్ముకొని బతకాల్సిన చేద్దరోజులు దాపురిస్తున్నప్పుడు, మట్టిని నమ్ముకొన్న రైతు బతుకు మట్టిలోనే పోలి అవుతున్నాపుడు వ్యవసాయం అస్తిత్వం ప్రస్నార్ధక మవుతుంది. పల్లెల వ్యవసాయానికి ఎగనామం పెడితే దుక్కులు దున్నేదెవరు  ? ఊళ్లుకు ఊళ్లు బీళ్ళు కాకుండా ఆపేదెవరు ? పంటలు పండించెదెవరు ? తింటానికి ఇన్ని గింజలో, కాయలో పెట్టేదెవరు ? అన్నం పెట్టె రైతు నోట్లో ఎంత కాలం ఇలా మట్టి కొడతారు ? చిగుళ్ళు ఎంత తిన్నా , మళ్ళీ మల్లె పుట్టుకొస్తూనే వుంటాయి. కాని మొదళ్ళు తినేదాక వస్తే మొక్క వుండదు. పాడి పంటలుండవు. రైతు వుండదు. చివరకు ఈ రాజ్యమే వుండదు.

Write a review

Note: HTML is not translated!
Bad           Good