జె.పి కలలు కన్న భారత దేశం - ఒక ఆదర్శ లోకం | జన సాధన సంపత్తి యావత్తూ నిర్భాలులు సేవకు అర్పితమౌతుంది. అక్కడ మానవత కేంద్రంగా వుంటుంది. అంతరాత్మ ప్రేరణ ప్రకారం పనులు చేసే అధికారం, అందుకు గౌరవం వుంటువి .విభిన్న భావాలు శాంతి యుతంగా చర్చించబడి సభ్యరీతిలో పరిష్కరింప బడతాయి. అక్కడ అందరికి పని వుంటుంది. ఆ పనిద్వారా సంతోషం, సుందర జీవితం లభిస్తాయి. ప్రతి వ్యాక్తికి తన సృజనాత్మక శక్తి వికసింప జేసుకునే అవకాశముంటుంది. కుటీర పరిశ్రమల్లోకాని , కర్మాగారాల్లోకాని యాజ మాన్యానికీ శామికులకూ సంబంధమూ భాగాస్యామ్యము వుంటాయి.  ఆ దేశంలో ప్రతి సాధనం ప్రజలకు కూడూ, గుడ్డ, గూడు మరియు నీరు ప్రతి అవసరాన్ని తీర్చడంలో నిమగ్నమై వుంటుంది. ఆ దేశంలో అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రజా సేవకులు. వారు మార్గం తప్పితే దండించే అధికారం ప్రజలకుంటుంది. ఒక సంపూర్ణ ప్రగతి శీల గాంధీ వాద స్వాతంత్య సమరశీల భారత దేశాన్ని రూపొందించటం కోసం ఆయన కళలు కన్నాడు. అందుకే జయప్రకాశ్ లోకమాన్యుడు ధన్యుడు  ||

Write a review

Note: HTML is not translated!
Bad           Good