ఇవి నిజంగా వెతలా! వెత అంటే బాధ, దిగులు, చింత అనేక పర్యాయపదాలు ఉన్నాయి. జనతా లాక్‌ డౌన్‌ మొదలైన ద్గర నుంచీ అసలీ లాక్‌ డౌన్‌ ఏంటి? కొన్ని పరిశ్రమలు నష్టాల బాట పట్టినపుడు లాక్‌ డౌన్‌ విధించడం సాధారణం. ''విశ్వం అనే పరిశ్రమకి లాక్‌ డౌన్‌ ఏంటి?'' అంతా... అయోమయం... భవిష్యత్తు అంథకారం.

కర్ఫ్యూ తెలుసు... 144 సెక్షన్‌ తెలుసు.. నా అరవై ఏళ్ళ వయసులో అనేక కర్ఫ్యూ రోజులు చూసాను. చిన్నప్పుడు అబ్బ ఇంకా కొన్ని రోజులు ఈ కర్ఫ్యూ ఉంటే బాగుండు స్కూల్‌కి వెళ్లక్కరలేదు అనుకున్న సంఘటనలు కూడా గుర్తున్నాయి. అలాంటిది ప్రధానమంత్రి గారు ప్రజల ముందుకు వచ్చి పదిరోజులు లాక్‌ డౌన్‌ ఎక్కడి వాళ్ళక్కడ ఉండండి... కదలద్దు.. అని ఆదేశాలు జారీ చేయడంతో అంతటా విస్మయం... పటిష్టంగా, కఠినంగా విధించిన నిబంధనలతో ప్రపంచంలోని ప్రతి వ్యక్తినీ నాలుగుగోడలకి పరిమితం చేసిన ఈ మహమ్మారి ఎక్కడ నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఏమీ అర్థం కావడంలేదు. చైనాలో జబ్బు మనకెందుకు వస్తుంది? అని పెదవి విరిచిన వారిలో నేనూ ఒకదాన్ని. లాక్‌డౌన్‌కి ముందు అద్భుతమైన కార్యక్రమాలు రెండు చేసి, ఏదో కరోనా అంటున్నారు... బయటకు వెళ్ళద్దు అంటున్నారు ప్రోగ్రాం ఉందా అని ఫోన్‌ చేసిన మిత్రులతో ''ఏమీ లేదండి... మనకి అలవాటేగా ఇదిగో తోక అంటే అదిగో పులి అనడం'' అని అందరినీ రప్పించిన నేను ఒక్కసారిగా ఈ విపత్తుతో స్థాణువు అయాను.....

పేజీలు : 118

Write a review

Note: HTML is not translated!
Bad           Good