17వ శతాబ్దంలో తెలుగునాట ముగ్గురు మహోన్నతమైన వ్యక్తులు నడయాడి కులమతాల కుళ్ళును, కుమ్ములాటలను ఎండగడుతు, మూఢవిశ్వాసాల గుట్టు రట్టుజేస్తూ, బాధగురువుల బారి నుండి ప్రజలను రక్షించేందుకు తమ కృషిని తమదైన శైలిలో నిర్వర్తించారు. వారు, ఒకరు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మం, మరొకరు దూదేకుల సిద్ధయ్య, ఇంకొకరు వేమన. వీరి నుద్దేశించిన ఒక పద్యం కూడా నానుడిలోకి వచ్చింది.
''యోగులెందన్న వేమన యోగియోగి
గురువులెందన్న బ్రహ్మయు గురుడు గురుడు
శిష్యులందెన్న సిద్ధయ్య సిసుడు సిసుడు
మతములన్నింట వేదాంతమతము మతము''
17వ శతాబ్దపు కాలమాన పరిస్థితిని పరిశీలించినట్లయితే రాజకీయ, సామాజిక, సాంఘిక మతకల్లోలాలు, మూఢ విశ్వాసాలు తీవ్రస్థాయికి చేరిఉన్నాయి. వీరశైవ, వైష్ణవ మతాలు తమ ఉనికి నిలబెట్టుకునేందుకు చేయరాని అకృత్యాలకు, హింసావాదాలకు తెరలేపుతున్న సందర్భాలు. వివిధముఠాలు, పీఠాలు రాజుల ఆశ్రయాన్ని పొంది రాజ్యమేలుతూ సమాజాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేయబడిన రోజులవి. ఆధ్యాత్మికత ముసుగులో ఆధిపత్యవర్గం మానవీయతను మట్టుపెడుతూ దోపిడీని చెలకట్టిస్తున్న కాలమది. విదేశీయులైన ముస్లింలు, ఆంగ్లేయులు, ఫ్రెంచివారు, డచ్వారు, మన ప్రాంతాల్లో సాంఘిక సంక్షోభాల్ని తెచ్చిపెడుతూ, మత, కుల వివక్షతకు ఆజ్యం పోస్తున్న బ్రాహ్మణులకు మతాధిపత్యాన్ని కాకుండా పరిపాలనా యంత్రాంగంలో కీలకస్థానాన్ని కల్పించారు. అధికారాన్ని ఆసరాగా చేసుకొని బ్రాహ్మణవర్గీయులు, ఇతర కులస్థులపై వీరికి గిట్టని మతస్థులపై, తప్పుడు సమాచారాన్ని పాలకులకు అందిస్తూ సమాజంలో అరాచకీయాన్ని సృష్టించేవారు....
తరతమ భేదాలు లేని, నిజాయితీ ఆధ్యాత్మికతలను తాత్త్వికతగా నిరూపించుకున్న గురువు బ్రహ్మంగారు. స్వయానా తన కడుపున పుట్టిన బిడ్డల కంటే మిన్నగా శిష్యులను చూశారు. - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
పోతులూరి వీరబ్రహ్మంగారు భక్తి జ్ఞాన మార్గంలోకి ప్రజలను మళ్ళించడానికి సాంఖ్య, చార్వాక, బౌద్ధ సూత్రాలను కూడా ప్రతిపాదించాడు. - కె.నాగేశ్వరాచారి
పేజీలు : 48