ఆరోగ్యం అంటే మన శరీరంలోని జీర్ణవ్యవస్థ, నాడీ వ్యవస్థ, హార్మోన్‌ వ్యవస్థ, విసర్జన వ్యవస్థలన్నీ సక్రమంగా పనిచెయ్యడం అంతేకానీ వ్యక్తి లావుగా వున్నాడా? సన్నగా ఉన్నాడా? అని చూసి ఆరోగ్యవంతుడని నిర్ణయించలేము. ఆరోగ్యం బావుంటే మనిషి చురుగ్గా, చలాకీగా వుండి తన వృత్తిని సక్రమంగా చేసుకోగలడు. శాకాహారం, మాంసాహారం అన్ని రకాలు తినవచ్చు. కానీ అన్నీ పరిమితంగానే తీసుకోవాలి. మాంసకృత్తులు, కార్బొహైడ్రేట్లు, మినరల్స్‌, విటమిన్లు అన్నీ సమపాళ్ళలో ఉన్నప్పుడే సమతుల్య ఆహారం అవుతుంది. ప్రాంతీయ శీతోష్ణస్థితులను బట్టి, వృత్తులను బట్టి కూడా ఆహారపు అలవాట్లు మారుతూంటాయి.

మనం రోజూ తినే కూరలలో అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలు, దుంప కూరలు ఉంటాయి. కాని వాటిలోని పోషక విలువలు, ఔషద విలువలు చాలా మందికి తెలియవు. రకరకాల మూఢనమ్మకాలతో చాలా రకాల కూరలు తినరు. చాలా ప్రాంతాల్లో గుమ్మడి, వంకాయలను, కీళ్ళ వ్యాధులు, చర్మవ్యాధులు వస్తాయని భోజనంలో తీసుకోరు. నిజానికి గుమ్మడి స్థూలకాయులకు, పైల్స్‌ బాధితులకు, ప్రోస్టేట్‌ గ్రంధి వాచిన వారికి సంజీవని లాంటిది. వంకాయలు మొలలు, మలబద్దక రోగులకు మంచి ఔషదము. తెల్లబీట్‌ దుంపల్ని బ్రిటన్‌లో పచ్చడి తయారుచేసి బ్రెడ్‌తో ఎంతో ఇష్టంగా తింటారు. జర్మనీ, ఫ్రాన్సులో కూడా ఉడికించిన దుంపలను లంచ్‌లో తీసుకుంటారు. కానీ స్పెయిన్‌, పోర్చుగల్‌లో వీటిని చాలా తక్కువగా వాడతారు. నేను అక్కడివారిని అడిగితే బీట్‌ మట్టి వాసన కొడుతుందని, అరగడం కష్టమని చెప్పారు. వైద్యపరంగా చూస్తే బీట్‌రూట్‌ మంచి జీర్ణకారి, గుండెను ఆరోగ్యస్థితిలో వుంచుతుంది. ఇవన్నీ సామాన్య జనంలో ఉన్న అవగాహనా రాహిత్యమే.

పేజీలు : 158

Write a review

Note: HTML is not translated!
Bad           Good