తెలుగులో వందల సంఖ్యలో శతకాలున్నాయి. వాటిలో వేమన శతకము, సుమతీ శతకము, దాశరథి శతకము, కృష్ణ శతకము, భాస్కర శతకము, శ్రీకాకుళాంధ్ర శతకము, నృసింహ శతకము మొదలుగునవి ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఈ శతకాలలో నీతి శతకాలు, భక్తి ప్రబోధక శతకాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాక సామాజిక స్థితిగతుల్ని తెలియజేసేవి, సామాజిక రుగ్మతల్ని ఎత్తిచూపేవి, మూఢాచారాల్ని ఖండించేవి ఉన్నాయి.

వేమన పద్యాలు మనవే! వేమన మనవాడు. అందరివాడు. అందీ అందనివాడు. పాఠకులకు ఆనందాన్నీ, చైతన్యాన్నీ అందించేవాడు. వేమన కేవలం ఒకవ్యక్తి కాదు - ఒక శక్తి. వేమన - కేవల ంఘంటం - తాటాకులూ పట్టుకొని పద్యాలు వ్రాసినవాడు కాడు. ఆశువుగ పద్యాలు పలికినవాడు. ఒకటా, రెండా, వందా - కొన్ని వేలపద్యాలను పలికినవాడు. వేమన ఎక్కువగా ఆటవెలది ఛందస్సుతో నృత్యం చేశాడు. అక్కడక్కడా కందాలున్నాయి. ఉత్పలమాలాది వృత్తాలూ ఉన్నాయి. ఆ పద్యాల్లో ఉన్నది కేవలం ఒక కథా? ఏమన్నానా? ఏ పద్యానికి ఆ పద్యమే. ఆనాటి సమాజమే ఆయనకు ఇతివృత్తం. సమాజాని&్న, మనుష్యుల మనస్తత్త్వాలనూ సునిశితంగా పరిశీలించాడు. నిర్మొహమాటంగా చెప్పాడు. చురకలు వేస్తూ చెప్పాడు. ఎగతాళి చేస్తూ కొందరిని గురించి చెప్పాడు. తన పరిహాసానికి గురైనవాడు కూడా హాయిగా నవ్వుకునేలా చెప్పాడు. వేమన పద్యాలను బట్టి కేవలం ఆయన నాస్తికుడా? అటే కాదు. కేవలం హేతువాదా? అంటే కాదు. ఆయనలో నాస్తికుడూ ఉన్నాడు. హేతువాదీ ఉన్నాడు. తాత్త్వికుడూ ఉన్నాడు. సాత్త్వికుడూ ఉన్నాడు. పరిశీలకుడూ ఉన్నాడు. యోగీ ఉన్నాడు. ఆశువుగా చెప్పిన ఆ పద్యాల్లో కూడా తెలుగుదేశీయ పదబంధాలున్నాయి. పలుకు బడులున్నాయి. సామెతలున్నాయి. వ్యాకరణయుక్తమైన రచనా ఉంది. వ్యాకరణ విరుద్ధమైన రచనా ఉంది. ప్రజలకు దగ్గరగా వచ్చి సూక్తుల్లా గుర్తుపెట్టుకునే విధమైన భావాలందించిన ప్రజాకవి. సరసంగానూ, హాస్యప్రాయంగానూ రచన చేసిన మజా కవి. సి.పి.బ్రౌన్‌ దగ్గర నుండి ఎందరెందరో వేమన పద్యాలకు వ్యాఖ్యానాలు వ్రాశారు. వ్యాస గ్రంథాలు రచించారు. ఎందరో వేమన పద్యాలను సంస్కృతంలోకి తర్జుమా చేశారు.... ఒక్కమాటలో చెప్పాలంటే వేమన పలికింది - వేదం. ఈ శతక పద్యాలు పిల్లలు చదవడం ద్వారా భాషాజ్ఞానం పెంపొందటంతోపాటు, మానసిక వికాసం కలుగుతుంది.

కవి పండితులు డా|| రామడుగు వెంకటేశ్వరశర్మ ఈ వేమన శతక పద్యాలకు సరళ సుందరంగా తాత్పర్యాలను రచించారు.

పేజీలు : 36

Write a review

Note: HTML is not translated!
Bad           Good