వంట ఆడవారే చెయ్యాలనే నిబంధనలకు కాలం చెల్లింది. ముఖ్య కారణం. ఈ రోజుల్లో పురుషులతో సమానంగా స్త్రీలు కూడా దేశ విదేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగాలలో పగలనక, రాత్రనక అహర్నిశలూ కష్టపడుతున్నారు. అందువలన స్త్రీలకు వంట చేయడానికి, పిల్లల ఆలనాపాలనా చూడటానికి తగిన సమయం ఉండటం లేదు. అన్ని ఊళ్ళల్లో మరియు విదేశాలలో కర్రీ పాయింట్లు ఉండకపోవచ్చు. అధవా ఉన్నా అదే పనిగా కర్రీ పాయింట్లలో వండిన పదార్థాలు తింటే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది.

దీనికి ఏకైక పరిష్కారం. మవారికి కూడా చిన్నతనం నుండి వంట చేయడం వచ్చి ఉండాలి. అవసరమైన మసయంలో భార్యాభర్తలు ఇద్దరూ వంట చేసే విషయంలో సహకరించుకుంటూ ఉండాలి. ఇందులో పురుషులు నామోషీ పడవలసిన పనిలేదు. భార్య చేసిన వంట భర్త మెచ్చుకుంటే ఆ ఇల్లాలు ఎంత ఆనందపడుతుందో, భర్త స్వయంగా చేసిన వంట భార్య మెచ్చుకున్నప్పుడు ఆ భర్తకు కూడా అంతే సంతోషం కలుగుతుంది. ఎటొచ్చీ ఆ సంతోషం అనుభవించినవారికే అనుభవేకవేద్యం. - ఆలూరు కృష్ణప్రసాదు

పేజీలు : 139

Write a review

Note: HTML is not translated!
Bad           Good