నగరం ఒక క్యారెక్టర్‌.

నగరంలో స్త్రీ ఇంకా ముఖ్యమైన కేరెక్టర్‌.

ప్రతి ఫ్లాట్‌లో పవర్‌ పోతే ఇన్వర్టర్లు,

అపార్ట్‌మెంటుకు జనరేటర్లు ఉంటున్నాయి.

వెలుతురులో చూస్తున్నాం అనుకుంటున్నాం.

కాని స్త్రీలను సరిగానే చూస్తున్నామా?

నాలుగు గోడల మధ్యన - చీకటి గుయ్యారం

వంటి అంతరంగంలో ఉడుకుతున్న

ఆలోచనాధార, చువ్వలను బిగించి పట్టుకున్న

వేళ్లలో నిండిన నిస్పృహ, మర్యాదకరమైన

పతనం, పతనంలో కూడా కాపాడుకోగలిగిన

సంస్కారం, రోదనలా వినిపించే నవ్వు, అగోచర

మంటలంటుకుని ఉన్న కుచ్చిళ్లు, భాస్వరాల

కొంగు ముడులు, సలపరించే వక్షాలు, నెరిసిన

వెంట్రుకల తలపోతల నిస్సహాయమైన

మూలుగు...

ఒక నాగరికతలో ఒక కాలపు శాంపిల్‌ ఈ కథలు.

హైదరాబాద్ నగరపు ఇన్నోసెంట్ ఫేస్ నుంచి, బాహువులు సాచుకుంటూ మనిషిని బిందువుగా మార్చగల-మరుగు పర్చగల- విలువలు వ్యాపారంగా, వ్యాపారం విలువగా మార్చిన ఈకాలంలో "కనపడని మనుషుల వినపడని మాటల" 25 విలక్షణ కధల సమాహారం.

పేజీలు : 154

Write a review

Note: HTML is not translated!
Bad           Good