దేశంలోని మెజారిటీ ప్రజలైన దళిత, ఆదివాసి, మైనారిటీ ప్రలజ శ్రమను దోచుకుంటూ కుర్చీలెక్కి కులుకుతున్న చెమటదొంగల చెమడా వొలుస్తుందీ కవిత్వం. వేయిపూలు వికసించనీ, వేయిభావాలు ఘర్షించని అనే ప్రజాస్వామిక భావాలు అదృశ్యమైపోయి నేడు గొడ్డుమాంసం తింటున్నాడని, గొడ్డుచర్మం వొలిచాడని వేటాడి, వేటాడి చంపే నయా ఫాసిస్టుల మధ్య బిక్కు బిక్కుమంటూ బతుకులు వెల్లదీస్తున్న దీనుల తరుపున వకల్తపుచ్చుకొని సాబిర్‌ కవిగా వాదిస్తున్నాడు. ఎన్నో తెగని ప్రశ్నల్ని సంధిస్తూ మా ఏడుపుల్ని మమ్మల్ని ఏడ్వనివ్వండి అంటూ కవిగాను, ఈ దేశముస్లింగాను సాబిర్‌ పెనుగులాడ్తున్నాడు. మనుష్యుల్ని కలిపే, మనసుల్ని కలిపే పండువెన్నెల్లాంటి రాజ్యాంగ సూత్రాల అమలును ఆచరణలో ఆకాంక్షిస్తూ, అత్తరుపుష్పాల మకరందాన్ని ఆవిష్కరిస్తూ అగరువొత్తుల్లా కాలిపోతున్న సాయిబుల దీనాలాపాల్ని నెమరేసుకుంటూ సాగుతుందీ పుస్తకం ఆకుపచ్చని తోరణాలను కట్టి నవభారత వసంతాన్ని ఆహ్వానిస్తూ... - షేక్‌ కరిముల్లా

పేజీలు : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good