నాయకులు పై నుండి ఆజ్ఞలివ్వడం గాక, ఆ పనిలో భాగం కావడం ద్వారానే మిగిలిన కార్యకర్తలను నడిపించగలరని, ఇదే నిజమైన ఆదర్శమని సోషలిస్టు ఆచరణ నుంచి రచయిత మనకు చెప్తాడు.

ఈ నవలలో చాలా సందర్బాలలో రచయిత ఇటువవంటి విలువల ప్రస్తావన చేస్తూ వచ్చారు. నిరంకుశంగా పని చేయించరాదని, అనవసరంగా దండించరాదని, దుందుడుకు ప్రవర్తన కార్యకర్తలకు మంచిది కాదని, భిన్న భావజాలాలలో ఉండే వారైనా మన పనికి సహకరిస్తున్నపుడు (నష్టం చెయ్యకుండా) ఇటువంటి వారిని కలుపుకపోవచ్చని... నవల చదువుతుంటే తెలుస్తుంది.

అదే కాదు, ముగింపులో షోలకోవ్‌ మనకు స్పష్టంగా చెప్పిందేమిటంటే - ఎప్పుడైనా, ఏ దశలోనైనా, అన్యవర్గ భావజాలం పునరావృత్తమవుతూనే ఉంటుంది. కనక నిరంతరం జాగరూకత వహించాలని మనలను హెచ్చరిస్తాడు.

ఆనాటి రష్యన్‌ ప్రజలకు విప్లవ ప్రభుత్వం అండగా ఉంది. ఇప్పుడు దండకారణ్య ఆదివాసులు యుద్ధం మధ్యలో ఉన్నారు. యుద్ధం చేస్తూనే సమిష్టి, సహకార వ్యవస్యా క్షేత్రానలు నిర్వహిస్తున్నారు. బూర్జువా రాజ్యం విధ్వంసం చేస్తోంటే పునర్నిర్మాణం చేస్తున్నారు. 'బీళ్ళు దున్నేరు' నాటి సమాజంతో ఇక్కడి స్థితిని పోల్చలేం గాని నవలలో సమిష్టి వ్యవసాయ క్షేత్రాల నిర్మాణ సందర్భంగా అనుసరించిన పద్ధతులు, ప్రజలతో వ్యవహరించిన తీరు, వారిలో చైతన్యం పెంచడానికి తీసుకున్న చర్యలు... ఇవన్నీ దండకారణ్య సందర్భంలో చదువుకోవడం అవసరం. - నల్లూరి రుక్మిణి

పేజీలు : 336

Write a review

Note: HTML is not translated!
Bad           Good