మానవజీవితంలో గణితం ప్రముఖ పాత్ర వహిస్తోంది. విద్యార్థి దశలో 'గణితం'పై కుతూహలం కలిగి, ఏకాగ్రతతో పట్టుదలగా ప్రాక్టీస్‌ చేస్తే ''గణితం'' విద్యార్థి మేధస్సుకు పదును పెడుతుంది. గణితంలో ప్రథమస్తానం పొందిన విద్యార్థి మిగిలిన అన్ని సబ్జెక్టులలోనూ ప్రథమంగానే వుంటాడనేది లోకోక్తి.

మానవజాతికి అవసరమైన విజ్ఞానమునంతా వేదాలలో నిక్షిప్తమైనదని ఆర్యోక్తి. ఋగ్వేదము, యమజర్వేదము, సామవేదము, అధర్వణవేదాలు నాలుగు మన పూర్వీకులు మనకు అందించిన సంపద. అందుండి మహారాజశ్రీ భారతీ కృష్ణ మహారాజ్‌ (శంకరాచార్య-గోవర్థన పీఠం) వారు గణితమునకు సంబంధించిన 16 సూత్రాలు - 13 ఉపసూత్రాలతో ''వేదగణితం'' ఇంగ్లీషులో వ్రాసారు. వాటి ఆధారంగా సులభంగా గణితాన్ని నేర్చుకోవచ్చని సూచించారు.

పేజీలు : 100

Write a review

Note: HTML is not translated!
Bad           Good