హంస మంజీరాలు

మాధవగిరి అన్ని హంగులూ గల పెద్దవూరు. వూరికి ఉత్తరాన, తూర్పున యెత్తయిన కొండలు కొడవాలుల్లో ఏపుగా యెదిగిన చిట్టడువులు. కొండకూ వూరుకూ మధ్య పంటచేలు. దక్షిణాన విశాలమైన పంట చెరువు, పడమట వేణుగోపాలస్వామి ఆలయం.

ఊరు మధ్యన ఒక పెద్ద ధర్మసత్రము. దాని నానుకొని పాఠశాల. ఆలయం నుంచి సత్రంకు వచ్చే వీధిలో అంగడి, అంగడి వెనుక వీధిలో ఆలయ మాన్యాలతో బతికే దేవదాసీల వాడ.

వేణుగోపాలస్వామి ఆలయానికి చేరువగా యెత్తయిన పాటి మట్టి ప్రాంగణంలో రెండంతస్థుల పురాతనమైన మేడ పాటి మట్టిగోడల కమర్చిన ఇనుప కెటకెటాల గేటుకు యిటూ, అటూ తుపాకి చేతపట్టుకుని నిలబడిన బొమ్మలు, ఆ గేటులోంచి మేడకు వెళ్లేదారికి రెండు పక్కలా, దారికి చలువ పందిళ్ళు కప్పినట్టు యెదిగిన కొబ్బరి మొక్కలు. ఒక పక్క ధాన్యపుగాదె, మరోపక్క పశువుల శాల. ఆ మేడను ఆ వూరి జనం, చుట్టు ప్రక్కల గ్రామాల జనం ''దివాణం'' అంటారు. ఇప్పుడా యింట్లో వుంటున్నది కృష్ణమరాయడు, అతని తల్లి పార్వతమ్మ.

ఆ యింటికిప్పుడు దివాన్‌జీ లేడు కానీ యింటిపనులు, వ్యవసాయం పనులూ చూచుకునేందుకు నలుగురైదుగురు పనివాళ్ళున్నారు. ఆ పని వాళ్ళందరికీ పెద్ద కొండయ్య.

కృష్ణరాయడు తన గదిలో అద్దం ముందు నిలబడి తల దువ్వుకున్నాడు. గదినుంచి బయటకు వచ్చి తన తల్లి పార్వతమ్మ గదికి వెళ్లి, ''నేను ఆలయానికి వెళ్ళొస్తానమ్మా'' అన్నాడు....

పేజీలు :192

Write a review

Note: HTML is not translated!
Bad           Good