వేదకల్పవృక్షం నుండి రాలిపడిన అమృతఫలం భాగవతం. దాని రుచిని తొట్టతొలుత ఆస్వాదించి ఆ మాధురీ మహిమను లోకానికి చాటి చెప్పిన మహానుభావుడు శుకమునీంద్రుడు. ఆ ఫలం భక్తసులభం. అందుకే ''భక్త్యా భాగవతం'' అన్నారు. వినయసంవలితమైన భక్తిభావం నిండుగా ఉన్న సుకృతి కాబట్టి శ్రీనందిపాటి శివరామకృష్ణయ్య గారికి భాగవత శ్రవణం, పఠనం, అనుభావనం, అనుజశీలనం చేసే సంస్కారం అబ్బింది. దాని ఫలితంగా ఋషిఋణం తీర్చుకోవాలన్న తపన బయలుదేరింది. జీవుని వేదన చిగురించింది. అది చెట్టుగా ఎదిగింది. దాని ఫలం ఈ 'ప్రశ్నోత్తర పోతన భాగవతం''. |