మనం నిత్యమూ సూర్యుని తేజాన్ని చూస్తున్నాం. నక్షత్రాలు, గ్రహాలు, చంద్రుడి తేజస్సు కూడా చూస్తూనే వున్నాం. కానీ మనలో కూడా ఒక తేజస్సు వుందనీ, అదే 'ఆత్మ'గా చెప్పబడుతోందనీ మనం గ్రహించలేకపోతున్నాం. జ్ఞానమనే చక్షువునే 'అంతర్నేత్రం' అంటారు. అది విచ్చుకోవాలంటే ఆధ్యాత్మిక జీవితాన్ని ఆశ్రయించక తప్పదు.

అగ్నిదేవుడు సర్వభక్షకుడు. దేన్నయినా దహిస్తాడు కానీ పాపాలను, అజ్ఞానాన్ని దహించలేడు. మనకు ప్రధమ శత్రువు, చివరి శత్రువు మన్మధుడే. శివుడు మన్మధుని దహించినా, అనంగుడిగానే మనల్ని వేధిస్తుంటాడు.

శరీర భ్రమలోంచి బయట పడటం, కోరికలు లేని జీవితం గడపటం - ఇవి రెండూ ఆధ్యాత్మిక జీవితానికి ఆలంబనలు.

శరీరం మీద ఎన్ని ఆధ్యాత్మిక చిహ్నాలు ధరించినా, అంతరంగం పరిశుద్ధం కానిదే, అంతర్నేత్రం తెరుచుకోదు. అంతర్నేత్రాన్ని మేల్కొలిపే ప్రయత్నంగానే ఈ ఆధ్యాత్మిక వ్యాసాలను పాఠకులకు సవినయంగా సమర్పిస్తున్నాను. - కాటూరు రవీంద్ర త్రివిక్రమ్‌

Write a review

Note: HTML is not translated!
Bad           Good