వాగ్గేయకారుల కీర్తనా వాజ్మయంతో తెలుగుభాషకు ప్రపంచ వ్యాప్తి లభించింది. వీరి సాహిత్యంలోని గొప్పతనం వల్లనే ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైన కర్నాటక సంగీతానికి తెలుగు ప్రధాన భాష కాగలిగింది. తాళ్ళపాక అన్నమాచార్యులు, మొవ్వపురి క్షేత్రయ్య, కంచర్ల గోపన్న (రామదాసు), కాకర్ల త్యాగరాజు, మునిపల్లె సుబ్రహ్మణ్య కవి ఇలా ఎందరో వాగ్గేయకారులు వేలాది కీర్తనలు రాసి దానికి ధాతు సౌభాగ్యాన్ని చేకూర్చి, వారు గానం చేసి, వేలాది విద్వాంసుల చేత గానం చేయించి ప్రపంచాన్ని నాదమయం చేశారు.

ఆధునికుల్లో కూడా దాసు శ్రీరాములు, ఆదిభట్ల నారాయణదాసు, హరినాగభూషణం, మంగళంపల్లి బాలమురళీకృష్ణ మొదలైన వాగ్గేయకారులు సంగీత ప్రపంచాన్ని ప్రభావితం చేశారు. అలాగే మనభాషకు చెందని హరికేశనల్లూర్‌, ముత్తయ్య భాగవతార్‌, మైసూర్‌ వాసుదేవాచార్య, జి.యన్‌.బాలసుబ్రహ్మణ్యం వంటి గొప్ప తెలుగు వాగ్గేయకారులున్నారు.

ఇలా వాగ్గేయ రచనలు చేసిన గొప్పవారిని తెలుగు విద్యార్థి లోకానికి పరిచయం చేయడానికి చేసిన చిన్న ప్రయత్నమే ఈ 'ప్రముఖ వాగ్గేయకారులు' పుస్తకం.

Pages : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good