ఇంట్లో, వంటింట్లో, బస్టాండ్‌లో, రైల్వేస్టేషన్లో, మాల్స్‌లో, పెళ్ళిళ్ళలో ఎక్కడ చూసినా చాటంత సెల్‌ పట్టుకుని దాంట్లో స్క్రోల్‌ చేస్తూ నవ్వుతూ, టెన్షన్‌, టెన్షన్‌ పడుతూ, బాధపడుతూ, చిరాకుపడుతూ, జట్టుపీక్కుంటూ ఉన్నారంటే అది ఫేస్‌బుక్‌ చూస్తున్నారన్నమాట.

ఫేస్‌బుక్‌లో ఏదో ఒక ఫోటోనో, కవితనో, కాకరకాయో పెట్టి పావుగంటకోసారి ఎన్ని లైకులు వచ్చాయో చూసుకునే వాళ్ళున్నారు.... కొంతమంది 18 గంటలు ఫేస్‌బుక్‌లో ఉండేవాళ్ళున్నారు. టైంకి అన్నం తినడం కూడా మర్చిపోయే వాళ్ళు ఉన్నారు.... మంచికీ, చెడుకీ, దుర్మార్గానికీ, కిరాతకానికీ, వికాసానికీ, వినోదానికీ అన్నిటికీ ఫేస్‌బుక్‌ వారధి అయింది.

అంటే ఫేస్‌బుక్‌ జనజీవనం మీద ఇంతగా సవారీ చేస్తోందంటే దాని మీద కొంతయినా ఎవేర్‌నెస్‌ తీసుకొస్తే బాగుంటుందని కార్లూన్లేయడం మొదలెట్టా... ఒకటి, రెండు, పది, ఇరవై ఇలా సాగి మొత్తం అరవై కార్టూన్లేశా... ఇవన్నీ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశా... అందులో చాలా వాటికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది. చాలా మంది నిజమేనని ఒప్పుకున్నారు కూడా... ఇందులో కొన్ని వెబ్‌మాగజైన్లలో, కొన్ని పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటన్నింటినీ కలిపి పుస్తకంగా తీసుకురావచ్చుగదా అనే మిత్రుల సూచనల పర్యవసానమే 'ఫేస్‌బుక్‌ కార్టూన్లు'.

Pages : 112

Write a review

Note: HTML is not translated!
Bad           Good