ఇదిగో స్వాతికుమారి పద్యాల నిండా, అక్షరాల నిండా, అక్షరాల మధ్య ఖాళీల నిండా... మనస్సు వుంది. తన పద్యాల్లో అందీ అందక వూరించే మీనింగ్‌, పేజీల బయటికి చేతులు చాచే ఆర్తి.

నిండు పున్నమి వెన్నెల రాత్రి నిర్జన మైదానంలోంచి దీర్ఘశృతిలో వినిపిస్తున్న ఒక ఊళ. ఆకలి కేక. ఇంకెవరో ఎక్కడో ఇంకెందుకో అన్నట్లు ఈ ఆకలి కేవలం అన్నం కోసం కాదు, గులాబీల కోసం కూడా. ముఖ్యం గులాబీల కోసమే. - హెచ్చార్కె

పువ్వులో సముద్రాన్ని చూస్తాను గనక,

వేళ్లతో ఇసుకలో తవ్వినప్పుడు నీటి

చెలమల్ని నిషేధించలేను గనకా,

తీరాన్నొదిలి వెళ్ళిపోయాక మళ్ళీ అంతా మామూలే

కదా అన్న ఆలోచనని నివారించలేను గనకా...

చెరిగిపోతాయని తెలిసి కాలక్షేపానికి కొన్ని పేర్లక్కడ

రాసిపోతాను.

వేళ మించినప్పుడు మళ్ళీ నేనే ఉప్పునీటి అలనై

వాటిని చెరిపిపోతాను.

Pages : 68

Write a review

Note: HTML is not translated!
Bad           Good