ఆధునిక ధనిక వ్యామోహంలో మునిగి... అమ్మ ప్రేమకు, ఆప్యాయతలకు దూరం అవుతున్న యువతరానికి హితబోధగా ''నేటి ప్రపంచం'' అనే కవిత రూపుదిద్దుకొన్నది. కిట్టన్న కవిగా తన అంతరంగమునే ''నిలువుటద్దం''గా చిత్రించిన కవిత చక్కగా... చిక్కగా ఉంది... ''అమృత కలశం ఆ అద్దం'', ''నిగూఢ గూఢచారి ఆ అద్దం'', అంతరంగిక స్నేహితుడా అద్దం'' అంటూ పలు రకాల రూపకాలతో మధుర భావామృతమును ప్రదర్శించి.. రుచి చూపించాడు... పగులనివవ్వని అద్దంలో!  సకల రకముల స్వార్థములకు నిలయమగుచున్న ప్రేమ రహిత మానసం'' పరిమళించని కాగితం పూవైంది'' అనే రూపకంతో ప్రదర్శించటం చక్కని భావ వ్యక్తీకరణ శక్తిగా గుర్తించాలి.

''బతుకొక చిల్లులుబడ్డ గొడుగే గదా'' అనే శీర్షిక గల కవితలో... ఆ శీర్షిక పదిసార్ల కంటే ఎక్కువసార్లు పునరుక్తమై... కవిగా ఈతని భావ వ్యథా గాఢత్వాన్ని చత్రించింది. మన తెలుగులో ప్రాచీన పండిత విమర్శకులు కొందరు 'పునరుక్తి'ని కవితా దోషంగా పరిగణించారు. ఆ పునరుక్తిలోని సమయానుకూల సమంజసమైన వ్యక్తీకరణ శక్తిని గుర్తించలేదు.

Pages : 104

Write a review

Note: HTML is not translated!
Bad           Good